E-Paper
Advertisement

Rashmika Mandanna: పెళ్లి ఫొటోలనూ వదలరా? ఇంటర్నెట్‌లో రష్మిక అశ్లీల ఫొటోలు, ఇంత దారుణమా?

Rashmika Mandanna: పెళ్లి ఫొటోలనూ వదలరా? ఇంటర్నెట్‌లో రష్మిక అశ్లీల ఫొటోలు, ఇంత దారుణమా?
Advertisement

Rashmika Mandanna:  నిన్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి చాలా ఘనంగా జరిగింది. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. రష్మిక ఎర్ర చీరలో, నగలు ధరించి..చాలా సంప్రదాయబద్ధంగా కనిపించింది. అభిమానులు కూడా ఆ ఫొటోలపై ప్రేమతో కామెంట్లు చేశారు.

కానీ ఇంతలోనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా రష్మిక పేరుతో కొన్ని ఫొటోలు షేర్ అయ్యాయి. ఎయిర్ బ్లెండర్ అనే ఐడి తో ఉన్న ఈ ఇంస్టాగ్రామ్ పేజీలో దాదాపు 12 ఫోటోలను షేర్ చేసింది. మొదట్లో ఉన్న రెండు ఫొటోలు నిజమైన పెళ్లి ఫొటోలాగే అనిపించాయి. కానీ ఆ తర్వాత స్వైప్ చేస్తే.. అవే ఫొటోలు ఏఐ ద్వారా మార్చి, చాలా అశ్లీలంగా చూపించారు. చీరను తప్పుగా చూపించడం, శరీర భాగాలను వక్రీకరించడం వంటి పనులు చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత నెటిజన్లు షాక్‌కు గురయ్యారు.

Advertisement

పెళ్లి లాంటి పవిత్రమైన సందర్భంలో తీసిన ఫొటోలనూ వదలకుండా, ఇలా ఏఐతో మార్పులు చేయడం ఎంతవరకు సరైందని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం రష్మికకే కాదు, ఏ మహిళకైనా జరగొచ్చు అనే భయం కూడా వ్యక్తమవుతోంది. టెక్నాలజీకి నియంత్రణ లేకపోతే, ఇలాంటి దారుణాలు మరింత పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.

ఇది రష్మికకు కొత్త విషయం కాదు. గతంలో కూడా ఆమెకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ వీడియోపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించి, డీప్ ఫేక్‌లపై కఠిన చర్యలు అవసరం అని అన్నారు.

Advertisement

ఇప్పుడు మళ్లీ ఆమె పెళ్లి ఫొటోలతో ఇదే జరగడం బాధాకరం. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? ఇలాంటి పేజీలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? అన్నది చూడాలి. ఏఐని బాధ్యతతో ఉపయోగించాలి అనే అవగాహన అందరికీ రావాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది.

ALSO READ: Vishnu Vinyasam Review: విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. ప్రేక్షకులకి ఆయాసం

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×