// // Rashmika vs Sreeleela: రష్మిక స్థానంలోకి శ్రీలీల.. పెళ్లి వల్లేనా ఇలా..! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Rashmika vs Sreeleela: రష్మిక స్థానంలోకి శ్రీలీల.. పెళ్లి వల్లేనా ఇలా..!

Rashmika vs Sreeleela: రష్మిక స్థానంలోకి శ్రీలీల.. పెళ్లి వల్లేనా ఇలా..!
Advertisement

Rashmika vs Sreeleela: ఇటలీలో జరిగిన మిలాన్ ఫ్యాషన్ వీక్లో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ ఓనిట్సుకా టైగర్ షోకు శ్రీలీల హాజరయ్యారు. ముఖ్యంగా ఆమె ఫ్రంట్ రో సీట్లో కూర్చోవడం నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షించింది. దీంతో “ఇండియాలో ఓనిట్సుకా టైగర్ బ్రాండ్ ముఖంగా రష్మిక స్థానంలో శ్రీలీల వచ్చిందా?” అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఓనిట్సుకా టైగర్ గానీ రష్మిక మందన్నా గానీ శ్రీలీల గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం ఒక ఫ్యాషన్ ఈవెంట్‌లో కనిపించిందని వెంటనే రీప్లేస్ అయిందని చెప్పడం కాస్త తొందరపాటు నిర్ణయమే అవుతుంది. అంతేకాకుండా రష్మిక పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వల్ల కూడా.. ఆ స్థానంలో శ్రీ లీల వచ్చి ఉండవచ్చు. అయినా సోషల్ మీడియాలో మాత్రం ఊహాగానాలు ఆగడం లేదు.

Advertisement

మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో శ్రీలీల ధరించిన డ్రెస్సింగ్ స్టైల్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. పసుపు రంగు జాకెట్‌తో పాటు లేయరింగ్ స్టైల్ ఆమెకు కొత్తగా కనిపించింది. ఆ లుక్ యువతకు బాగా నచ్చిందని ఫ్యాషన్ అభిమానులు చెబుతున్నారు. సాధారణంగా యూత్ ట్రెండ్‌ను ఫాలో అయ్యే బ్రాండ్స్ ఇలాంటి లుక్స్‌కే ప్రాధాన్యం ఇస్తుంటాయి.

మరోవైపు రష్మిక మందన్నా ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలే కాకుండా ఫ్యాషన్ బ్రాండ్స్‌తో కూడా ఆమెకు బలమైన అనుబంధం ఉంది. నేషనల్ క్రష్‌గా పేరొందిన రష్మికను ఒక్కసారిగా పక్కన పెట్టేస్తారని అనుకోవడం అంత ఈజీ కాదు.

Advertisement

ఫ్యాషన్ బ్రాండ్స్ సాధారణంగా ఒకే దేశంలో ఒకరికి మించి సెలబ్రిటీలను ప్రమోట్ చేస్తుంటాయి. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో స్టార్‌ను ఆహ్వానించడం కూడా చాలా సాధారణ విషయం. కొత్త మార్కెట్‌ను టార్గెట్ చేయడం లేదా కొత్త టాలెంట్‌ను పరిచయం చేయడం కోసం ఇలా చేస్తుంటారు. అందుకే శ్రీలీల హాజరు కావడం రష్మికకు రీప్లేస్‌మెంట్ అని తేల్చేయలేం.

ప్రస్తుతం శ్రీలీల సినిమాల పరంగా కూడా మంచి ఫామ్‌లో ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఆమెకు క్రేజ్ పెరుగుతోంది. అదే సమయంలో ఫ్యాషన్ ప్రపంచంలో కూడా అవకాశాలు రావడం ఆమె కెరీర్‌లో సహజమైన ముందడుగే అని చెప్పాలి.

మొత్తం పైన ఇప్పటివరకు ఇది కేవలం సోషల్ మీడియా ఊహాగానాలే. అధికారిక ప్రకటన వచ్చే వరకు రష్మిక స్థానంలో శ్రీలీల వచ్చిందని చెప్పడం కష్టం. ఫ్యాషన్ రంగంలో మార్పులు సాధారణమే. నిజం ఏంటన్నది కాలమే తేల్చాలి.

ALSO READ: Youtuber Komali: అతను నా వాడు కాదని తెలుసు…యూట్యూబర్ కోమలి చివరిగా ఏం రాసిందంటే..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×