E-Paper
Advertisement

Rashmika Mandanna: బాలీవుడ్ సినిమాకు నో చెప్పిన రష్మిక.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనుందా?

Rashmika Mandanna: బాలీవుడ్ సినిమాకు నో చెప్పిన రష్మిక.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనుందా?
Advertisement

Rashmika Mandanna: సినీనటి రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా  ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈమె పుష్ప సినిమాలో నటించడం, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కావడంతో తదుపరి పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంటున్నారు. ఇలా ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రష్మిక కెరియర్ కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రష్మిక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రైస్తవున్న ఈమె సినిమాలకు దూరం కావడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు.

ఫిబ్రవరి 26న విజయ్ రష్మిక పెళ్లి…

రష్మిక గురించి ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు ఈమె మరొక నాలుగు రోజులలో మరొక నటుడు విజయ్ దేవరకొండతో కలిసి ఏడడుగులు నడవబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం ఫిబ్రవరి 26వ తేదీ ఎంతో ఘనంగా జరగబోతోంది ఇలా పెళ్లి తర్వాత రష్మిక సినిమాలకు దూరంగా ఉండబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్మిక ఒక బాలీవుడ్ సినిమాని కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్న ఈమె కొత్త సినిమాలకు కమిట్ అవ్వటం లేదట.

రష్మిక సినిమాలలో నటించరా?

Advertisement

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సినిమాలో రష్మికకు నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు అమిత్ శర్మ ఈ సినిమా కథను రష్మికకు చెప్పినప్పటికీ ఈమె మాత్రం ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా బాలీవుడ్ సినిమాలను రష్మిక రిజెక్ట్ చేయడంతో పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నారా లేకుంటే సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నారా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.. విజయ్ దేవరకొండ తో పెళ్లి తర్వాత రష్మిక కొంత సమయాన్ని గడపడం కోసమే ఈమె కొత్త సినిమాలకు కమిట్ అవ్వకుండా రిజెక్ట్ చేస్తున్నారంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి.

మరోసారి జంటగా విజయ్ రష్మిక..

Advertisement

మరి నిజంగానే రష్మిక పెళ్లి తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతం ఈమె పలు సినిమాలకు కమిట్ అయి ఉన్నారు ఈ సినిమాలన్నీ కూడా షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి. ఇక పెళ్లి కోసం రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా తమ సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరూ రణబాలి అనే సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి వెండి తెరపై సందడి చేయబోతున్నారు.

Also Read: Sree vishnu: విష్ణు విన్యాసం, మృత్యుంజయ విడుదలపై శ్రీ విష్ణు క్లారిటీ.. బయటపడ్డానంటూ!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×