// //
Rashmika Mandanna: పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఓ పబ్లిక్ ఈవెంట్‌కు హాజరయ్యారు. గురువారం, మార్చి 19న హైదరాబాద్ నగరం నడిబొడ్డున జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Telangana Gaddar Film Awards) వేదికగా రష్మిక మందన్నా హాజరయ్యారు. ఆమె నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girl Friend) చిత్రానికి గానూ రష్మిక ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అవార్డును తీసుకోవడానికి అత్తగారితో కలిసి వచ్చిన రష్మిక.. సీఎం రేవంత్ రెడ్డి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును అందుకునే సమయంలో రష్మిక గురించి యాంకర్ సుమ మాట్లాడుతుండగా.. వెంటనే రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కలగజేసుకుని, ‘మా వారి కోడలు’ అని అన్నారు. అంతే ఈ వేడుకకు హాజరైన వారంతా.. క్లాప్స్‌తో హోరెత్తించారు. అవార్డు అందుకున్న అనంతరం రష్మిక మందన్నా మాట్లాడుతూ..
Also Read- CM Revanth: దుబాయ్ డేంజర్‌లో ఉంది.. హైదరాబాద్ సేఫ్.. సినీ పెద్దలకు ఇదే నా డిమాండ్!
‘‘ఈ వేదిక సాక్షిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు నా నటనపై ట్రోల్స్ వచ్చేవి. ఇప్పుడు నటిగా మెప్పించి, స్టేట్ నుంచి ఈ అవార్డును అందుకున్నాను. ఇది ఎప్పటికీ నా మనసులో గుర్తుండిపోతుంది. అందులోనూ ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి చిత్రానికి అవార్డు రావడం చాలా చాలా స్పెషల్. ఎందుకంటే, ఇంకా ఇలాంటి ఎన్నో చిత్రాలు చేయడానికి నాకు కాన్ఫిడెంట్‌ని ఈ అవార్డు ఇచ్చింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాహుల్‌కి థ్యాంక్యూ చెబుతున్నాను, రష్మిక, భూమా (సినిమాలో రష్మిక పేరు) ఇద్దరూ.. నన్ను ఎంతగానో ప్రొటక్ట్ చేసిన రాహుల్‌కి థ్యాంక్స్ చెబుతున్నారు. ఇంకా ఈ సినిమాకు పనిచేసిన అందరికీ థ్యాంక్స్’’ అని చెప్పారు.
Also Read- CM Revanth Reddy: ఈ అవార్డ్స్‌కు గద్దర్ పేరు అందుకే పెట్టాం.. ఫస్ట్ టైం చెప్పిన సీఎం రేవంత్!
ఇక తన వివాహం అనంతరం ఎక్కడా మాట్లాడని, ప్రేక్షకులతో తన అనుభవాన్ని షేర్ చేసుకోని రష్మిక ఈ వేదికను అందుకు ఉపయోగించుకున్నారు. ‘‘నేను కోడలిగా రాకముందు, తెలుగు ప్రేక్షకులు ఒక కూతురిలా నా పై ప్రేమ చూపించారు. ఇప్పుడు కోడలిగా మీ ముందు నిలబడి ఉన్నాను. నాకు గర్వంగా అనిపిస్తుంది. మీ ప్రేమ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇకపై నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను. నేను గెలుపొందాను. ఇక ఇంటికెళ్లి పార్టీ చేసుకుందాం’’ అని రష్మిక చెప్పుకొచ్చారు. నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను అని రష్మిక అన్నప్పుడు ఆమె అత్తగారు, విజయ్ దేవరకొండ మదర్ ఎమోషనల్ అయ్యారు. ఆమె కళ్ల నీళ్లను తుడుచుకోవడం మీడియా క్యాప్చర్ చేయడంతో.. ఆమె ఎంతగానో ఎమోషనల్ అయిందీ అర్థమైంది.
Also Read- CM Revanth Reddy: హైదరాబాద్.. ఐటీ, ఫార్మా, బిర్యానీలకు మాత్రమే ఫేమస్ కాదు