E-Paper
Advertisement

Rashmika Mandanna : రష్మిక బ్యాచిలర్ పార్టీలో ఊహించని వ్యక్తి సడెన్ సర్‌ప్రైజ్

Rashmika Mandanna :  రష్మిక బ్యాచిలర్ పార్టీలో ఊహించని వ్యక్తి సడెన్ సర్‌ప్రైజ్
Advertisement

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం కెరీర్ పరంగానే కాకుండా, వ్యక్తిగత జీవితం పరంగా కూడా హాట్ టాపిక్‌గా మారారు. 2025 సంవత్సరం ఆమెకు గోల్డెన్ ఇయర్‌గా నిలిచిందని చెప్పాలి. వరుస విజయాలతో బాలీవుడ్ భామలకే సవాల్ విసురుతున్న రష్మిక, త్వరలోనే ఇంటి కోడలు కాబోతున్నారనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

బాక్సాఫీస్ వద్ద రష్మిక జైత్రయాత్ర
ఒకప్పుడు కేవలం గ్లామర్ డాల్‌గా ముద్ర వేయించుకున్న రష్మిక, ఈ ఏడాది తనలోని అసలైన నటిని బయటకు తీశారు. ఆమె నటించిన ‘ఛావా’, ‘కుబేర’, ‘థామా’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రాలు ఒకదానిని మించి ఒకటి విజయాలు సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఈ విజయాలతో బాలీవుడ్‌లో ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

Advertisement

విజయ్ దేవరకొండతో ఏడడుగులు?
కొన్నేళ్లుగా రష్మిక – విజయ్ దేవరకొండల మధ్య ఏదో నడుస్తోందని వస్తున్న రూమర్లకు ఈ ఏడాది బలం చేకూరింది. వీరిద్దరూ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని, వారి చేతికి ఉన్న ఉంగరాలే అందుకు సాక్ష్యమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ ఓ ఈవెంట్‌లో రష్మిక చేతిని ముద్దాడటం, ప్రతి అమ్మాయి జీవితంలో విజయ్ లాంటి వ్యక్తి ఉండాలని రష్మిక అనడం వీరి మధ్య ఉన్న గాఢమైన బంధాన్ని చెప్పకనే చెబుతోంది.

పెళ్లి ముహూర్తం ఖరారు?
ఫిలింనగర్ సమాచారం ప్రకారం.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వీరిద్దరి వివాహం అట్టహాసంగా జరగనుంది. ఎంగేజ్‌మెంట్‌ను గోప్యంగా ఉంచిన ఈ జంట, పెళ్లిని మాత్రం సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అనంతరం హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

Advertisement

 

శ్రీలంకలో బ్యాచిలర్ పార్టీ?
పెళ్లి వార్తలు వైరల్ అవుతున్న తరుణంలోనే, రష్మిక తన గాల్ గ్యాంగ్‌తో కలిసి శ్రీలంక ట్రిప్ వేశారు. ఈ ట్రిప్‌లో మరో హీరోయిన్ వర్ష బొల్లమ్మ సైతం దర్శనం ఇచ్చారు. వర్ష బొల్లమ్మతో పాటు తన ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌ లోకేషన్స్‌లో చిల్ అవుతున్న ఫోటోలను ఆమె షేర్ చేశారు. అయితే నెటిజన్లు మాత్రం ఇది బ్యాచిలర్ పార్టీ అని, విజయ్‌తో పెళ్లికి ముందే ఫ్రెండ్స్‌కు రష్మిక గ్రాండ్ పార్టీ ఇస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×