// // Dhurandhar Movie : పాకిస్థాన్‌లో దురంధర్ మూవీ రచ్చ రచ్చ... -->
E-Paper
Advertisement

Dhurandhar Movie : పాకిస్థాన్‌లో దురంధర్ మూవీ రచ్చ రచ్చ… గత 20 ఏళ్లల్లో ఇదే తొలిసారి

Dhurandhar Movie : పాకిస్థాన్‌లో దురంధర్ మూవీ రచ్చ రచ్చ… గత 20 ఏళ్లల్లో ఇదే తొలిసారి
Advertisement

Dhurandhar Record in Pakistan: ఈ మధ్య మన ఇండియన్‌ సినిమాలు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. ఏ భాష చిత్రమైన విదేశీ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే మన ఇండియన్‌ సినిమాలు పాకిస్తాన్‌లో బ్యాన్‌ అయిన సంగతి తెలిసిందే. మన దాయాది దేశమైన పాక్‌లో బాలీవుడ్‌ చిత్రాలకు మంచి క్రేజ్‌ ఉంది. అయితే బాలీవుడ్‌ చిత్రాలు ఇప్పుడు అక్కడ రిలీజ్ అవ్వడం లేదు. అయినా కూడా అక్కడ మన సినిమాలను పైరసీ చేసి మరి వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో పైరసీలో బాలీవుడ్‌ చిత్రాలు రికార్డు బ్రేక్ చేస్తున్నాయి. ఇప్పటి షారుక్ చిత్రాలు ఈ జాబితాలో ఉండగా.. తాజాగా వాటిని రణ్‌వీర్‌ సింగ్‌ ధురంధర్‌ దాటేసింది. 

పాక్‌ ‘ధురంధర్’ రికార్డ్

Advertisement

రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ధురంధర్‌ డిసెంబర్‌ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి ఈ మూవీ హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని రోజులకే ఈ సినిమా రూ. 500 కోట్లు దాటేసింది. రెండు వారాలకే ఈ చిత్రం రూ. 800 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం దాయది దేశమైన పాకిస్తాన్‌లో విడుదల కాలేదు. పాక్‌తో పాటు ఆరు గల్ఫ్‌ దేశాల్లో ఈ మూవీ విడుదల కాలేదు. అయినా అక్కడ పౌరులు ధురందర్‌ మూవీ చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం. పాకిస్తాన్ పౌరులు ఈ చిత్రాన్ని పైరేటెడ్ సైట్ల నుండి విరివిగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ధురంధర్’ గత 20 ఏళ్లలో పాకిస్తాన్‌లో అత్యధికంగా పైరసీ అయిన బాలీవుడ్‌ చిత్రంగా నిలిచింది.

3.3 మిలియన్ల డౌన్‌లోడ్

కాగా ‘ధురంధర్’ను పాకిస్తాన్ వ్యతిరేక చిత్రంగా భావించి పాక్‌తో పాటు గల్ఫ్ దేశాలలో విడుదల చేయలేదు. పాకిస్తాన్‌లో భారతీయ కళాకారులు, చిత్రాలపై నిషేధం కూడా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే అక్కడ కూడా ఈ చిత్రం విడుదల కాలేదు. అయితే ఆ ప్రభావం ‘ధురంధర్’ బాక్సాఫీస్‌పై పెద్దగా లేదు. ఈలోగా, పాకిస్తానీయులు ‘ధురంధర్’ను పైరేటెడ్ సైట్ల నుండి డౌన్‌లోడ్ చేసుకుని చూస్తున్నారట. ఇలా ఇప్పటి వరకు ఈ సినిమా పలు పైరసీ వెబ్‌ సైట్ల నుంచి దాదాపు 3.3 మిలియన్ల వరకు డౌన్‌లోడ్‌ చేసినట్టు బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. ఎన్‌డిటివి నివేదిక ప్రకారం.. గత 12 రోజుల్లో పాకిస్తాన్‌లో పైరేటెడ్ సైట్ల నుండి ‘ధురంధర్’ను సుమారు 3.3 మిలియన్ సార్లు డౌన్‌ లోడ్ చేశారు. టోరెంట్, విపిఎన్, అక్రమ లింకుల ద్వారా రణవీర్ సింగ్ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని చూస్తున్నారని సమాచారం.

Advertisement

Also Read: Bigg Boss 9 Buzz: కళ్యాణ్‌ విజయం వెనకుంది దివ్యా?.. మరి తనూజ సంగతేంటి!

‘ధురంధర్’ బాక్సాఫీస్ కలెక్షన్స్

దీంతో ‘ధురంధర్’ పాకిస్తాన్‌లో గత 20 ఏళ్లలో అత్యధికంగా పైరేట్ చేయబడిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. దీంతో పాక్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసిన చిత్రాల్లో షారుక్‌ ఖాన్‌  ‘రయీస్’, ‘2.0’ చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు 3.3 మిలియన్ల డౌన్‌లోడ్‌తో రణ్‌వీర్‌ సింగ్‌ ధురంధర్‌ షారుఖ్‌ చిత్రాలను అధిగమించింది. డిసెంబర్ 5, 2025న థియేటర్లలో ‘ధురంధర్’ విడుదల అయ్యింది. సినిమా విడుదలై రెండు వారాలు గడిచినా ప్రతి రోజూ డబుల్ డిజిట్ వసూళ్లను సాధిస్తోంది. 13 రోజుల్లో ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్‌లో 454.20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ‘ధురంధర్’ రూ. 600 కోట్ల మార్కును దాటింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×