E-Paper
Advertisement

రామాయణ సినిమా రిజెక్ట్ చేసిన రణబీర్ కపూర్… ఆ ఒక్క కారణంతోనే సినిమా చేశాడా?

రామాయణ సినిమా రిజెక్ట్ చేసిన రణబీర్ కపూర్… ఆ ఒక్క కారణంతోనే సినిమా చేశాడా?
Advertisement

Ranbir Kapoor: రణబీర్ కపూర్ పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక రణబీర్ కపూర్ ప్రస్తుతం రామాయణ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం 2026 దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాబోతోంది అలాగే రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

రామాయణ రిజెక్ట్ చేసిన రణబీర్..

ఈ సినిమాకు సంబంధించి ఒక గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ రెండో తేదీ ఈ వీడియోని విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలలో చిత్ర బృందం పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే నటుడు రణబీర్ కపూర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. డైరెక్టర్ నితీష్ తివారి ఈ సినిమా కథ తనకు చెప్పినప్పుడు మొదట్లో రిజెక్ట్ చేసానని రణబీర్ కపూర్ తెలిపారు. ఇలా ఈ సినిమా రిజెక్ట్ చేయడానికి గల కారణాలను కూడా ఈయన ఈ సందర్భంగా తెలియజేశారు.

రాముడు పాత్రకు న్యాయం చేయగలనా?

Advertisement

ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు శ్రీరాముడి పాత్రలో కనిపించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి పాత్రలో నేను చేయగలనా? ఒకవేళ చేసిన ఈ పాత్రకు న్యాయం చేయగలనా? అనే ఆత్మవిశ్వాసం నాలో లేకపోవడంతో మొదట్లో ఈ కథ రిజెక్ట్ చేశానని రణబీర్ తెలిపారు. ఇక తన కుమార్తె పుట్టిన తర్వాత భయం కాస్త కృతజ్ఞతగా మారడంతో నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని ఈ సినిమాకు ఓకే చెప్పానని రణబీర్ కపూర్ తెలిపారు. ఇలా భయం ఆత్మవిశ్వాసం లేకపోవడంతోనే  రిజెక్ట్ చేశానంటూ రణబీర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సీతగా సాయి పల్లవి..

Advertisement

ఈయన శ్రీరాముడి పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించడంతో ఎన్నో విమర్శలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై కూడా చిత్ర బృందం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఈయన శ్రీరాముడి పాత్రలో కనిపించగా సీత పాత్రలో సాయి పల్లవి కనిపించబోతున్నారు. ఇక రావణాసురుడిగా యష్ నటించబోతున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సుమారు నాలుగువేల కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్,మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ పై నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీ విడుదల చేయబోయే గ్లింప్స్ లో భాగంగా ఈ సినిమాలో నటీనటుల పాత్రలను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: శర్వానంద్’ బైకర్ ‘సెన్సార్ పూర్తి…కత్తెర పెట్టిన సెన్సార్ బోర్డు.. రన్ టైం ఎంతంటే!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×