E-Paper
Advertisement

విజయ్ దేవరకొండ బర్త్ డే…స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన రణబాలి టీమ్!

విజయ్ దేవరకొండ బర్త్ డే…స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన రణబాలి టీమ్!
Advertisement

Ranabaali Film: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు .రౌడీ జనార్ధన్ సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబాలి(Ranabaali) సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక నేడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈయన సినిమాల నుంచి వరుస అప్డేట్స్ తెలియజేస్తూ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారని చెప్పాలి.

విజయ్ హార్స్ రైడింగ్..

రౌడీ జనార్ధన్ చిత్ర బృందం ఒక అద్భుతమైన పోస్టర్ విడుదల చేయగా తాజాగా రణబాలి టీం ఒక మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తూ విజయ్ దేవరకొండకు పుట్టిన రోజు (Vijay Devarakonda Birthday) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేకింగ్ వీడియోలో భాగంగా విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ నేర్చుకోవడం, హార్స్ రైడింగ్ చేస్తూ పడిపోవడం వంటి విజువల్స్ చూపించారు. హార్స్ రైడింగ్ కోసం ఎన్నో కష్టాలు పడిన విజయ్ చివరికి పర్ఫెక్ట్ గా గుర్రపు స్వారి చేస్తున్నట్టు చూపించారు. ఈ సినిమా కోసం విజయ్ ఎంతలా కష్టపడుతున్నారనేది ఈ వీడియో ద్వారా మేకర్స్ తెలియజేశారు.

జయమ్మ పాత్రలో రష్మిక..

Advertisement

ఈ సినిమా నుంచి ఈ మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ వీడియో పై స్పందిస్తూ విజయ్ డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఒక యోధుడి పాత్రలో విజయ్ కనిపించబోతున్నారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఒక గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవ్వడమే కాకుండా సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఈ సినిమా రాయలసీమ బ్యాగ్రౌండ్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ రణబాలిగా కనిపించగా, రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్ గా జయమ్మ అనే పాత్రలో కనిపించబోతున్నారు.

Advertisement

ఇదివరకే వీరిద్దరికి సంబంధించిన పోస్టర్స్ విడుదల చేయడంతో ఈ పోస్టర్స్ కి మంచి ఆదరణ లభించింది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ముచ్చటగా మూడోసారి ఈ సినిమా ద్వారా వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే రష్మిక విజయ్ భార్య భర్తల అయిన తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మొదటి సినిమా కావటం విశేషం. ఇదివరకే వీరిద్దరూ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించారు అయితే ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు దారి తీసింది. రష్మిక విజయ్ ఫిబ్రవరి 26వ తేదీ ఉదయ్ పూర్ లో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే.

Also Read: తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ పై లైలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్…

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×