E-Paper
Advertisement

Peddi Movie: మెగా ఫాన్స్ కు షాకింగ్ న్యూస్.. వాయిదా పడిన పెద్ది?

Peddi Movie: మెగా ఫాన్స్ కు షాకింగ్ న్యూస్.. వాయిదా పడిన పెద్ది?
Advertisement

Peddi Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. 2025వ సంవత్సరంలో మెగా కుటుంబం నుంచి విడుదలైన సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఒక ఓజీ మినహా హరిహర వీరమల్లు ,గేమ్ చేంజర్ లాంటి సినిమాలు అభిమానులను పూర్తిగా నిరాశపరిచాయి. ఇక 2026వ సంవత్సరంలో మెగా ఫ్యామిలీ నుంచి వరుస సినిమాలు విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే రామ్ చరణ్ పెద్ది, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆతృతగా ఈ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.

వాయిదా పడిన పెద్ది…

సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి సినిమా విడుదల కాగా, ఉగాది పండుగ సందర్భంగా రామ్ చరణ్ (Ramcharan)నటించిన పెద్ది సినిమా (Peddi Movie)విడుదలవుతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాని మార్చి 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించారు . అయితే గత కొంతకాలంగా ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చాయి కానీ చిత్ర బృందం మాత్రం యధావిధిగా ఈ సినిమా మార్చ్ 27వ తేదీ విడుదల కాబోతోందని తెలియజేశారు. తాజాగా ఈ సినిమా వాయిదా పడినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

డిసెంబర్ కు వాయిదా పడిన పెద్ది..

Advertisement

పెద్ది సినిమా మార్చ్ 27న విడుదల చేయాలని చిత్ర బృందం భావించినప్పటికీ పలు సాంకేతిక కారణాలు అలాగే విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలో ఈ సినిమాని అనుకున్న సమయానికి  విడుదల చేయటం కుదరలేదట. అందుకే ఈ సినిమాని తప్పనిసరి పరిస్థితులలో 2026 డిసెంబర్లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా అవుట్ ఫుట్ విషయంలో బుచ్చిబాబు ఏ మాత్రం రాజీ పడకుండా ప్రేక్షకులకు మంచి సినిమాని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా మార్చిలో కాకుండా డిసెంబర్ లో విడుదల కాబోతుందనే విషయం తెలియడంతో పెద్ది కోసం నిరీక్షణ తప్పదని తెలుస్తోంది.

అప్పల సూరిగా జగపతిబాబు..

Advertisement

ఇకపోతే పెద్ది సినిమా వాయిదా పడుతోంది అంటూ వస్తున్న ఈ వార్తల గురించి చిత్ర బృందం ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే గ్రామీణ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.. సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా నుంచి ఒక గ్లింప్ వీడియోతో పాటు, చికిరి చికిరి అనే పాటను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.. త్వరలోనే సెకండ్ సింగిల్ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈమె క్రికెట్ కామెంటేటర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రముఖ సీనియర్ నటుడు జగపతిబాబు(Jagapathi Babu) అప్పలసూరి అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

Also Read: Gogineni on Garikapati: గరికపాటిది నీచ భాష కాదా.. రంగంలోకి బాబు గోగినేని!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×