E-Paper
Advertisement

Manchu Manoj: మనోజ్ సినిమాలో రామ్ చరణ్ క్యామియో… భారీ స్కెచ్ వేసిన మంచు హీరో?

Manchu Manoj: మనోజ్ సినిమాలో రామ్ చరణ్ క్యామియో… భారీ స్కెచ్ వేసిన మంచు హీరో?
Advertisement

Manchu Manoj: మంచు వారసుడిగా బాల నటుడిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో మనోజ్(Manoj ) ఒకరు. గతంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనోజ్ కొన్ని కారణాలవల్ల ఇండస్ట్రీకి దాదాపు 9 సంవత్సరాల పాటు దూరమయ్యారు. పూర్తిగా తన వ్యక్తిగత విషయాల వల్లే ఈయన ఇండస్ట్రీకి దూరమయ్యారని వెల్లడించారు అయితే ఇప్పుడే ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భైరవం సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న మనోజ్ అనంతరం మిరాయ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో మనోజ్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

మనోజ్ కోసం రామ్ చరణ్..

ఇక త్వరలోనే మనోజ్ డేవిడ్ రెడ్డి(David Reddy) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం క్యాస్టింగ్ వర్క్ జరుగుతుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో క్యామియో పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కనిపించబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మనోజ్ చరణ్ ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనోజ్ కోసం చరణ్ క్యామియో పాత్రలో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.

మనోజ్ డేవిడ్ రెడ్డి …

Advertisement

రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈయన క్యామియో పాత్రలో నటిస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి కానీ మనోజ్ కోసం చరణ్ నటించడానికి కూడా సిద్ధమయ్యారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఈ సినిమాలో మరొక తమిళ హీరో కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది .మనోజ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన శింబు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ వార్తలకు సంబంధించి అధికారక ప్రకటన రానుంది.

అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు చరణ్..

Advertisement

ఇలా మనోజ్ సినిమాలో చరణ్ నటించబోతున్నారని వార్తలు బయటకు రావడంతో అభిమానులు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు మంచు విష్ణు కన్నప్ప కోసం ప్రభాస్ ను రంగంలోకి దింపగా ఇప్పుడు మనోజ్ రామ్ చరణ్ ను తన సినిమాలో భాగం చేస్తున్నారు ఏదేమైనా మంచు హీరోలు భారీ ప్లాన్ చేశారు అంటూ అభిమానులు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రాంచరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని 2026 మార్చిలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా అనంతరం సుకుమార్ డైరెక్షన్ లో చరణ్ బిజీగా ఉన్నారు.

Also Read: Pawan Kalyan -Sujeeth: ఓజీ డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎన్ని కోట్లంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×