E-Paper
Advertisement

రికార్డుల వేటలో నితీష్ తివారీ ‘రామాయణ’.. థియేట్రికల్, డిజిటల్ రైట్స్ మరీ అన్ని కోట్లా..?

రికార్డుల వేటలో నితీష్ తివారీ ‘రామాయణ’.. థియేట్రికల్, డిజిటల్ రైట్స్ మరీ అన్ని కోట్లా..?
Advertisement

Ramayana Rights: దర్శకుడు నితీష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక వెండితెర అద్భుతం ‘రామాయణం’ (Ramayana) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. 2026 దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా, థియేటర్లలోకి రాకముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం మేకర్స్ కళ్ళు చెదిరే భారీ డీల్స్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.

Read also-Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి ఫుల్ హ్యాపీ..అయ్యో రామరాజు కన్నీళ్లు.. నర్మదకు దిమ్మతిరిగే షాక్..

హిందీ థియేట్రికల్ హక్కుల ధర రూ. 450 కోట్లు?

Advertisement

వెబ్ మీడియా కథనాల ప్రకారం.. ఈ రెండు భాగాల సినిమా దేశీయ పంపిణీ హక్కుల కోసం నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రస్తుతం పలువురు అగ్రశ్రేణి పంపిణీదారులతో (డిస్ట్రిబ్యూటర్స్) చర్చలు జరుపుతున్నారు. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కేవలం హిందీ థియేట్రికల్ పంపిణీ హక్కుల కోసమే మేకర్స్ ఏకంగా రూ. 450 కోట్ల భారీ ధరను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ డీల్ రూ. 300–400 కోట్ల మధ్య కుదిరినా, భారతీయ సినిమా చరిత్రలోనే ఇది ఒక సరికొత్త రికార్డు అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతానికి హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక థియేట్రికల్ హక్కుల రికార్డు షారుఖ్ ఖాన్ నటించిన ‘కింగ్’ సినిమా పేరిట ఉంది. ఇప్పుడు ‘రామాయణం’ ఆ రికార్డును తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

డిజిటల్ హక్కుల కోసం రూ. 1,000 కోట్లు!

Advertisement

కేవలం థియేట్రికల్ హక్కులే కాకుండా, ఓటీటీ (డిజిటల్), శాటిలైట్ హక్కుల విషయంలోనూ ఈ సినిమా భారీ మొత్తాన్ని అందుకోనుంది. గతంలో రెండు భాగాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఆఫర్ చేసిన రూ. 700 కోట్లను నిర్మాత నమిత్ మల్హోత్రా తిరస్కరించినట్లు ఇండస్ట్రీ టాక్. కేవలం డిజిటల్ హక్కుల ద్వారానే ఏకంగా రూ. 1,000 కోట్ల డీల్ సాధించాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం.

Read also-Gundeninda Gudigantalu Vidya : ‘గుండెనిండా గుడిగంటలు ‘ విద్య రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

రూ. 4,000 కోట్ల బడ్జెట్..

దాదాపు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా, భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా భారతదేశంలోనే రూ. 1,000 నుండి రూ. 1,500 కోట్ల వరకు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 2,500 కోట్ల కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×