E-Paper
Advertisement

Ramanaidu Studios: పన్ను ఎగవేత.. జీహెచ్‌ఎంసీ నోటీసులపై స్పందించిన రామానాయుడు స్టూడియోస్‌

Ramanaidu Studios: పన్ను ఎగవేత.. జీహెచ్‌ఎంసీ నోటీసులపై స్పందించిన రామానాయుడు స్టూడియోస్‌
Advertisement

Ramanaidu Studios Reacts on GHMC Notice: టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థలైన రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోస్‌ ట్యాక్స్‌ కట్టడం లేదంటూ నిన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపాలిటీ కార్పొరేషన్‌ (GHMC) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నిర్దేశించిన టాక్స్‌ మొత్తాన్ని కాకుండ చాలా తక్కువ మొత్తంలో ట్యాక్స్‌ కడుతున్నాయని , వెంటనే ట్యాక్స్‌ క్లియర్‌ చేయాలని నోటీసులో ఆదేశించారు. అయితే తాజాగా ఈ నోటీసులపై రామానాయుడు స్టూడియో (సురేష్ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) స్పందించారు. ఈ మేరకు అధికారిక ప్రెస్‌ నోట్‌ విడుదల చేస్తూ వివరణ ఇచ్చారు.

క్రమం తప్పడం లేదు.. 

జీహెచ్‌ఎంసీ జారీ చేసిన డిమాండ్‌ నోటీసుల మేరకు ప్రతి ఏడాది ట్రేడ్‌ లైసెన్స్‌ ఫిజులను మేము క్రమం తప్పకుండ చెల్లిస్తూనే వస్తున్నాం. ఆస్తి పన్ను ట్రేడ్‌ లైసెన్స్‌ ఫిజు విధించే విసయంలో జీహెచ్‌ఎంసీనే సమర్థవంతమైన అధికారిక సంస్థగా గుర్తిస్తున్నాము. అన్ని చట్టబద్దమైన అంశాలతోనే మేము ట్యాక్స్ కడుతూ అధికారులకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని మా సంస్థ స్పష్టం చేస్తోంది. చాలా ఏళ్లుగా ఉన్న జీహెచ్‌ఎంసీ రికార్డుల ప్రకారం ఆస్తి పన్నును 68.276 చదరపు అడుగుల బిల్ట్‌-అప్ ఏరియా ఆధారంగా నిరంతరం అంచనా వేసి చెల్లిస్తున్నామని మా స్టూడియో స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎప్పడూ ఎలాంటి విషయాలను దాచిపెట్టడం, తప్పుడు నివేదిక ఇవ్వడం వంటి అవకతవకలు జరగలేదని రామానాయుడు స్టూడియో తన ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

అవన్ని నిజం కాదు

కాగా బిల్ట్‌- అప్‌ ఏరియాకు సంబంధించిన ఎలాంటి దాపరికాలు లేవని, కమ్యూనికేషన్‌ గ్యాప్‌ కూడా లేదు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఊహాగానాలు మాత్రమేనని, అందులో ఎలాంటి వాస్తవం లేదని స్టూడియో స్పష్టం చేసింది. అలాగే రామానాయుడు స్టూడియోస్‌ అన్ని జీహెచ్‌ఎంసీ నిబంధనలను తూ.చగా పాటిస్తుందని, అధికారులత పూర్తి పారదర్శకతను కొనసాగిస్తున్నట్టు ప్రస్‌ నోట్‌ లో పేర్కొన్నారు. టాలీవుడ్‌ సినీ పరిశ్రమలో అతిపెద్ద నిర్మాణ సంస్థ కేంద్రాలలో ఒకటైన రామానాయుడు స్టడియోస్‌.. తమ వ్యాపార నిర్వహణలో చట్టపరమైన, నైతిక విలువల పట్ల నిబద్ధత ఉన్నామని వెల్లడించింది.

Advertisement

Also Read: Bigg Boss 9 Elimination: లీస్ట్‌లో దివ్య, సంజన.. ఈ వారం హౌజ్‌ నుంచి ఈమె అవుట్‌!

అలాగే ఈ ఏడాది ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులను జీహెచ్‌ ఎంసీ భారీగా సవరించింది. గతంలో ఏడాదికి రూ. 7,614 గా ఉన్న ఫీజుని ఒక్కసారిగా రూ. 2 లక్షల 73వేల 104 వందల రూపాయలకు పెంచింది. పెరిగిన మొత్తాన్ని కూడా రామానాయుడు స్టూడియోస్‌ యథావిధిగా చెల్లించింది. అయితే ఇంత బారీ పెరుగుదలను తట్టుకోవడం కష్టమని, న్యాయబద్ధత, స్థిరత్వం కోసం ఈ మొత్తాన్ని హేతుబద్దికరించాల్సిన అవసరం ఉందని తమ స్టూడియో జీహెచ్‌ఎంసీని విజ్ఞప్తి చేసింది. దీనిపై వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామంటూ తమ ప్రకటనలో పేర్కొన్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×