E-Paper
Advertisement

Peddi: వాయిదా పడ్డ రామ్ చరణ్ పెద్ది? పెద్ద సినిమాలకు తప్పని ఇబ్బందులు

Peddi: వాయిదా పడ్డ రామ్ చరణ్ పెద్ది? పెద్ద సినిమాలకు తప్పని ఇబ్బందులు
Advertisement

Peddi: బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన సినిమా తర్వాత రామ్ చరణ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. బాక్సాఫీస్ వద్ద ఉప్పెన సినిమా ఏ స్థాయి సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. మొదటి సినిమాతోనే 100 కోట్ల మార్కెట్లోకి ఎంట్రీ అయిపోయాడు బుచ్చిబాబు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తాడు అని చాలామంది ఊహించారు. కానీ అది జరగలేదు. మొత్తానికి రామ్ చరణ్ హీరోగా చేస్తున్న పెద్ది సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ షాట్ వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నాడు. ఇకపోతే రంగస్థలంలో చిట్టిబాబు పాత్రను మించి ఈ పాత్ర ఉంటుంది అని చాలామంది ఊహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే చిక్కిరి అనే మొదటి సింగిల్ కూడా విడుదల చేశారు. ఈపాటికి 100 మిలియన్స్ పైగా వ్యూస్ కూడా వచ్చాయి. రీసెంట్ టైమ్స్ లో ఈ సాంగ్ ఒక సెన్సేషన్.

పెద్ది సినిమా వాయిదా 

Advertisement

పెద్ది సినిమాను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా 27నే కాకుండా కొన్ని రోజులు ముందుగానే విడుదలవుతుంది అనే వార్తలు కూడా వచ్చాయి.

మార్చి 26న విడుదల చేస్తామని అలానే మార్చి 25న కొన్నిచోట్ల ప్రీమియర్స్ వేస్తామని తిరుమల లో దర్శకుడు బుచ్చిబాబు చెప్పారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పెద్ది సినిమా వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ వాయిదా అని మాత్రం సమాచారం వినిపిస్తుంది.

పెద్ద సినిమాలకు చిక్కులు 

Advertisement

కొన్నిసార్లు రిలీజ్ డేట్ ప్రాబ్లం వలన చిన్న సినిమాలు వాయిదా పడుతూ ఉంటాయి. కానీ ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేసిన పెద్ద సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో వాయిదా అయిపోతున్నాయి. ముఖ్యంగా అఖండ 2 సినిమా విషయంలో ఫ్యాన్స్ ఎంతగానో నిరాశ చెందారు. కాసేపట్లో ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి అనుకున్న తరుణంలో ఏకంగా సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది.

బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్ హీరో సినిమాకు ఇలా జరగడం అనేది బాధాకరమైన విషయం. ఇప్పుడు పెద్ది సినిమా కూడా వాయిదా అని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్యారడైజ్ సినిమా వాయిదా పడుతున్నట్లు కూడా విపరీతంగా వార్తలు వచ్చాయి. దీనిని బట్టి మార్చి నెలలో రావలసిన సినిమాలు కూడా రావేమో అని అభిమానులు సందిగ్ధంలో పడిపోయారు.

Also Read: Annagaru vostharu Trailer : ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ తో అన్నగారు వస్తారు, ట్రైలర్ ఎలా ఉందంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×