E-Paper
Advertisement

Ramcharan: చిరంజీవి కొడుకు కావడం భారమా? బాధ్యత?  చరణ్ సమాధానం ఇదే!

Ramcharan: చిరంజీవి కొడుకు కావడం భారమా? బాధ్యత?  చరణ్ సమాధానం ఇదే!
Advertisement

Ramcharan: సినిమా ఇండస్ట్రీలో వారసత్వం గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలు వినపడుతూనే ఉంటాయి. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అవ్వడం కంటే కూడా వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించడం చాలా సులభం అంటూ సినీ వారసులపై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే ఒక స్టార్ హీరో కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారికి ఆ లెగసిని కంటిన్యూ చేయడం ఎంతో కష్టతరం అవుతుందని మరికొందరు వాదిస్తూ ఉంటారు. కేవలం సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి మాత్రమే వారసత్వం పనికి వస్తుందని ఇండస్ట్రీలో నిలబడటానికి కాదు అంటూ ఎంతో మంది వారసులు ఈ విషయంపై వారి అభిప్రాయాలను తెలియచేశారు.

మెగా వారసుడిగా చరణ్..

ఈ నేపథ్యంలోనే మెగా వారసులుగా ఇండస్ట్రీలో ఎంతోమంది కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి వారసుడు రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో హీరోగా కొనసాగుతున్నారు. ఒక స్టార్ హీరో కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అదే స్థాయిలో ఆదరాభిమానాలను సొంతం చేసుకోవడం ఎంతో కష్టతరం. ఈ నేపథ్యంలోనే నటుడు రామ్ చరణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడంతో ఆయనకు ఇదే విషయంపై ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

మెగా లెగసీ భారం కాదు..

Advertisement

చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి రావడం గురించి రాంచరణ్ కు ప్రశ్నలు ఎదురవడంతో చరణ్ మాట్లాడుతూ.. నేను ఒక సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి రావడం అనేది ఒక గొప్ప అవకాశం గానే భావిస్తున్నాను. ఒక కొత్త వ్యక్తి యాక్టింగ్ స్కూల్ కి వెళ్లి నేర్చుకునే ఎన్నో విషయాలను నేను ఇంట్లోనే నేర్చుకోగలిగానని చరణ్ తెలిపారు. ఇక మెగా లెగసిని భారంగా తాను ఎప్పుడూ చూడలేదని, మెగా వారసుడిగా నన్ను అంగీకరించడానికి ప్రేక్షకులకు కష్టమైందేమో కానీ, నాకు మాత్రం ఏ మాత్రం భారం కాదని చరణ్ తెలియజేశారు.

పెద్దిపై భారీ అంచనాలు..

Advertisement

ఇక సినిమా మంచి సక్సెస్ అయితే ఆ సక్సెస్ ను తాను ఎప్పుడూ తలకు ఎక్కించుకోనని చరణ్ తెలిపారు. కానీ ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు మాత్రం కాస్త బాధగా ఉంటుందని ఒక ఫెయిల్యూర్ మనల్ని ఒక అడుగు వెనక్కి పడేలా చేస్తుందని చరణ్ తన కెరియర్ గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది (Peddi Movie)అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. గ్రామీణ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదల చేసిన చికిరి చికిరి అనే పాట 200 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకుని సంచలనాలను సృష్టించడమే కాకుండా సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది.

Also Read: Rukmini Vasanth: డేటింగ్ లో కాంతార నటి రుక్మిణి వసంత్..క్లారిటీ వచ్చేసిందిగా!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×