E-Paper
Advertisement

రణ్‌వీర్ సింగ్ రూ. 1800 కోట్ల రికార్డులపై గ్లోబల్ స్టార్ రియాక్షన్.. ‘ధురంధర్’ రేంజ్ అదిరిందన్న చరణ్!

రణ్‌వీర్ సింగ్ రూ. 1800 కోట్ల రికార్డులపై గ్లోబల్ స్టార్ రియాక్షన్.. ‘ధురంధర్’ రేంజ్ అదిరిందన్న చరణ్!
Advertisement

Ram Charan Dhurandhar: బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా, ప్రతిభావంతుడైన దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక ‘ధురంధర్’ ఫ్రాంచైజీపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల జరిగిన రిపబ్లిక్ సదస్సులో పాల్గొన్న రామ్ చరణ్, ఈ చిత్రం సాధించిన ఘనవిజయాన్ని అభినందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంపై ఆయన వ్యక్తంచేసిన సానుకూల స్పందన ఇప్పుడు అటు బాలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

Read also-Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి అడ్డంగా దొరికిపోయింది.. నర్మదకు నిజం తెలుస్తుందా..? వల్లికి జాగారం..

Advertisement

ఈ సదస్సులో రామ్ చరణ్ మాట్లాడుతూ, తాను ఇటీవల ఓటీటీ వేదికగా ‘ధురంధర్’ చిత్రాన్ని వీక్షించానని, ఇందులో ప్రతి అంశం సరైన రీతిలో, అద్భుతమైన టెంపోతో కుదిరిందని పేర్కొన్నారు. కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో ఈ చిత్రం కీలక పాత్ర పోషించిందని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో వచ్చే సినిమాల్లో ‘ఇండియా ఫస్ట్’ అనే జాతీయ సమగ్రత భావన ఎంతో ముఖ్యమని, ఈ సినిమా ఆ భావాన్ని ప్రతిబింబిస్తూ దేశాన్ని ఏకం చేసిందని ప్రశంసించారు.

Read also-Brahmamudi Serial Today Episode June 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన ఇందు – నవ్వుకున్న రాజు  

Advertisement

బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఫ్రాంచైజీ సాధిస్తున్న అసాధారణ వసూళ్లపై కూడా రామ్ చరణ్ స్పందించారు. ‘ధురంధర్’ సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ ఏకంగా రూ. 1,800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. బాక్స్ ఆఫీస్ నంబర్లు అనేవి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల ఆదరణకు ప్రతీకలని, భారతీయ ప్రేక్షకులు ఒక సినిమాను ఇంతగా ఓన్ చేసుకుంటే అది దేశ చిత్ర పరిశ్రమకే ఎంతో మంచిదని చరణ్ స్పష్టం చేశారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×