E-Paper
Advertisement

పెద్ది ట్రైలర్ రివ్యూ.. రామ్ చరణ్ ‘బీస్ట్ మోడ్’.. బుచ్చిబాబు ప్యూర్ మాస్ జాతర!

పెద్ది ట్రైలర్ రివ్యూ.. రామ్ చరణ్ ‘బీస్ట్ మోడ్’.. బుచ్చిబాబు ప్యూర్ మాస్ జాతర!
Advertisement

Peddi Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా.. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ముంబైలో జరిగిన ట్రైలర్ టేకోవర్ ఈవెంట్‌లో రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ వదిలిన కాసేపటికే ఇండస్ట్రీలో మరియు నెట్టింట తెగ వైరల్ అయిపొయింది.

ఆంధ్రప్రదేశ్ బ్యాక్ డ్రాప్ లో

Advertisement

ట్రైలర్ చూస్తే సినిమా 1980ల కాలం నాటి రూరల్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని క్లియర్ గా అర్థమవుతుంది.ఇక ట్రైలర్ చూస్తుంటే పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడి మనుషుల ఎమోషన్స్‌ను బుచ్చిబాబు చాలా అద్భుతంగా స్క్రీన్‌పై ఆవిష్కరించాడనే చెప్పాలి. ముఖ్యంగా విజువల్స్‌ను చాలా గ్రాండ్‌గా, పీరియాడిక్ లుక్ వచ్చేలా చూపించిన ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది.

రెండు భిన్నమైన షేడ్స్

Advertisement

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడని క్లారిటీ వచ్చేసింది . ఒకవైపు పల్లెటూరి క్రికెటర్ గా, మరోవైపు పవర్‌ఫుల్ ‘పెద్ది పెహల్వాన్’ గా ఆయన చూపించిన రగ్గడ్ అండ్ మాస్ లుక్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ ఈ ట్రైలర్‌కు మేజర్ హైలైట్‌గా నిలిచాయి. జాన్వీ కపూర్ లంగా ఓణీ కల్చర్‌లో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా మెప్పించడమే కాకుండా, రామ్ చరణ్‌తో ఆమె కెమిస్ట్రీ కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. వీరితో పాటు బోమన్ ఇరానీ ,కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యెందు శర్మల పాత్రలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి.

also read :వైరల్ వీడియో.. పబ్లిక్‌గా ‘బూతు’ పదం వాడేసిన రష్మిక.. నెటిజన్లు ఫైర్!

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ట్రైలర్‌ను వేరే లెవెల్‌

ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ట్రైలర్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లిపోయింది. ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో వచ్చే ఆర్ఆర్ థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం.ఇక ఇప్పటికే “నేను పెద్ది ట్రైలర్ చూశాను, జస్ట్ వావ్! చరణ్, బుచ్చిబాబు, రెహమాన్ అందరూ కలిసి అదరగొట్టేశారు” అంటూ మెగాస్టార్ చిరంజీవి తన రివ్యూ ఇచ్చిన సంగతి తెల్సిందే.

భారీ ఎమోషనల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా

మొత్తంగా ‘పెద్ది’ ట్రైలర్ క్రికెట్ మరియు అటు సాంప్రదాయ కుస్తీ (రెజ్లింగ్) ల కలబోతగా భారీ ఎమోషనల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా సినిమా ఉండబోతుందన్నని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.చూడాలి మరి సినిమాపై ఉన్న అంచనాల్ని ట్రైలర్ డబల్ చేయగా, జూన్ 4న రానున్న సినిమా ఆ అంచనాలని ఏ మేరకి అందుకుంటుందో !

also read :‘పెద్ది’ ట్రైలర్ చూసి కంట్రోల్ తప్పిన చిరంజీవి.. డైలాగ్ లీక్ చేస్తూ ఊరమాస్ రివ్యూ!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×