E-Paper
Advertisement

సెన్సార్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ ‘పెద్ది’.. ఈ డిటైల్స్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే..

సెన్సార్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ ‘పెద్ది’.. ఈ డిటైల్స్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే..
Advertisement

Peddi Runtime: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. భారీ అంచనాల మధ్య జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది.

Read also-This Week OTT Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

నిడివి ఎంతంటే?

Advertisement

సాధారణంగా ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాల రన్‌టైమ్ 2 గంటల 30 నిమిషాల లోపే ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ‘పెద్ది’ చిత్రం కోసం దర్శకుడు బుచ్చిబాబు సన ఏకంగా 189 నిమిషాల (3 గంటల 9 నిమిషాలు) భారీ రన్‌టైమ్‌ను లాక్ చేసినట్లు సమాచారం. సినిమాలోని ఎమోషనల్ డెప్త్, గ్రామీణ నేపథ్యంలోని క్రీడాంశాలు (క్రికెట్, రెజ్లింగ్) ప్రేక్షకులను కథలో లీనం చేసేలా ఉండటం వల్లే ఈ సుదీర్ఘ నిడివిని ఉంచినట్లు తెలుస్తోంది. ఈ భారీ రన్‌టైమ్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకులలో సినిమా స్కేల్‌పై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.

కథపై నమ్మకంతోనే..

ఇటీవల కాలంలో ‘యానిమల్’, ‘ధురంధర్’ వంటి సుదీర్ఘమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. కథలో దమ్ముంటే రన్‌టైమ్‌తో ప్రేక్షకులకు సంబంధం లేదని ఆ సినిమాలు నిరూపించాయి. ‘పెద్ది’ విషయంలో కూడా దర్శకుడు బుచ్చిబాబు సన కథ, కథనాలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. రామ్ చరణ్ తన స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి ఈ కథకు ప్రాణం పోశారని, ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఎమోషన్స్ ఉంటాయని ఇప్పటికే డైరెక్టర్ పేర్కొన్నారు. విజయనగరం యాసలో రామ్ చరణ్ చెప్పే డైలాగులు, ఆయన రగ్గడ్ లుక్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Advertisement

Read also-యుజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్ రూమర్లపై ఆర్జే మహ్వాష్ షాకింగ్ కామెంట్స్!

జూన్ 4న గ్రాండ్ రిలీజ్

వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి భారీ తారాగణం నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న థియేటర్లలోకి రానుంది (జూన్ 3న ప్రీమియర్స్). ముంబైలో భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ 189 నిమిషాల ఎమోషనల్ అండ్ రస్టిక్ జర్నీ బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ కెరీర్‌లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×