// // Peddi Glimpse: రామ్ చరణ్ ‘పెద్ది’ పహిల్వాన్ గ్లింప్స్ వచ్చేశాయ్.. -->
E-Paper
Advertisement

Peddi Glimpse: రామ్ చరణ్ ‘పెద్ది’ పహిల్వాన్ గ్లింప్స్ వచ్చేశాయ్.. ఆట పొగరు చూసేయండి మరి..

Peddi Glimpse: రామ్ చరణ్ ‘పెద్ది’ పహిల్వాన్ గ్లింప్స్ వచ్చేశాయ్.. ఆట పొగరు చూసేయండి మరి..
Advertisement

Peddi Glimpse: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పవర్ ఫుల్ పహిల్వాన్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ అంచనాలకు తగ్గట్టుగా ఉంది. వీడియో చూస్తుంటే రామ్ చరణ్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఈ గ్లింప్స్‌లో రామ్ చరణ్ ఒక రెజ్లర్ (పెహిల్వాన్) పాత్రలో అదరగొట్టారు. ఇంతకు ముందు వచ్చిన ప్రచార చిత్రాల్లో క్రికెట్ ఆటగాడిగా కనిపించారు. ఇప్పుడు పహిల్వాన్ గా కనిపించారు.  ఆయన బాడీ మేకోవర్, గుబురు గడ్డం, పవర్ ఫుల్ లుక్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా కుస్తీ పోటీల కోసం ఆయన చేస్తున్న కఠినమైన శిక్షణ, ప్రత్యర్థులతో తలపడే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి.

Read also-Ram Charan: రామ్ చరణ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. ఫోటోలు వైరల్..

డైలాగ్స్ మామూలుగా లేవుగా..

Advertisement

వీడియోలో వినిపించే “కుస్తీ అంటే బంతితో బ్యాట్ కెదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో చావుకెదురెళ్లే ఆట” అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్ రామ్ చరణ్ మాస్ ఇమేజ్ కలగలిపి ఈ చిత్రాన్ని ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. గ్లింప్స్‌లో వినిపించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్లను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 30, 2026 దేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×