E-Paper
Advertisement

RRR, మగధీరలను కాదని పెద్దికే ఫస్ట్ ప్లేస్ ఇచ్చిన చరణ్.. జక్కన్న రియాక్షన్ ఏంటో మరి!

RRR, మగధీరలను కాదని పెద్దికే ఫస్ట్ ప్లేస్ ఇచ్చిన చరణ్.. జక్కన్న రియాక్షన్ ఏంటో మరి!
Advertisement

Peddi Release: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోయడానికి డేట్ లాక్ చేసుకుంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా.. రిలీజ్‌కు పది రోజుల ముందే నార్త్ ఇండియాలో సంచలనాలు స్ప్రుష్టిస్తుంది.

చరణ్ కామెంట్స్  ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌

Advertisement

ఈక్రమంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈరోజు చిత్ర యూనిట్ నిర్వహించిన భారీ ప్రమోషనల్ ఈవెంట్ చూస్తే.. నార్త్ లో చరణ్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయిపోయిందనే చెప్పాలి.అసలు ఇసుక వేస్తే రాలనంతగా వచ్చిన జనం ఒక ఎత్తయితే, ఈ వేదికపై రామ్ చరణ్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారాయి.

Also read :చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారా? పెద్ది ఆపితే ఆమరణ దీక్షేఅంటున్న టాలీవుడ్ ప్రొడ్యూసర్

Advertisement

ఈ సినిమా కోసం పడ్డ కష్టం గురించి చెప్తూ.. “నా సినిమా లైబ్రరీలోనే ఈ ‘పెద్ది’ సినిమాకి మొదటి స్థానం ఉంటుంది” అని చరణ్ ఏకంగా పెద్ద స్టేట్‌మెంటే ఇచ్చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నా.. నెటిజన్లు మాత్రం క్రేజీగా డిస్కషన్స్ మొదలుపెట్టారు. మరి మనకు ‘మగధీర’, గ్లోబల్ వైడ్‌గా ‘RRR’ లాంటి కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన జక్కన్న (రాజమౌళి) దీనికి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి అంటూ సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టేస్తున్నారు మూవీ లవర్స్.

హెల్లాళ్లాలో’ (Hellallallo) సాంగ్ లాంచ్ 

ఇక ఈ గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్‌లో ఆస్కార్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ తన బృందంతో కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు.ముఖ్యంగా తెలుగు, హిందీ సూపర్ హిట్ పాటలతో భోపాల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.ఇక అందరూ ఊహించినట్టుగా మోస్ట్ ఎవైటెడ్ ‘హెల్లాళ్లాలో’ (Hellallallo) సాంగ్ ను కూడా ఇక్కడే రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు.

Also read :అల్లు అర్జున్ ఇంట్లో ఆర్‌సీబీ స్టార్ సందడి.. అల్లు అయాన్ కోసం వెంకటేష్ అయ్యర్ స్పెషల్ సర్ప్రైజ్!

ఈ ఈవెంట్‌కు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు నటుడు రవి కిషన్. ‘రేసు గుర్రం’ సినిమాలో ‘శివారెడ్డి’గా మనల్ని ఎంతగా అలరించాడో తెల్సిందే.అలాంటి ఈ వెర్సటైల్ యాక్టర్ హిందీలో ఇచ్చిన పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ స్పీచ్ నార్త్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమా రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

పుష్ప 2 దీటుగా పెద్దిని ల్యాండ్ అవుతాడా?

మొత్తానికి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రీడా నేపథ్య చిత్రంపై భోపాల్ ఈవెంట్ తర్వాత అంచనాలు స్కై హైకి చేరిపోయాయనే చెప్పాలి . ఈ రేంజ్ రెస్పాన్స్ చూస్తుంటే.. జూన్ 4న నార్త్ ఇండియాలో రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.చూడాలి మరి పుష్ప 2 దీటుగా పెద్దిని ల్యాండ్ చేయాలని భావిస్తున్న చరణ్ ఆశల్ని పెద్ది తీరుస్తాడో లేదో !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×