E-Paper
Advertisement

Peddi Chikiri Chikiri Song : ‘సామాన్ల’ పంచాయితీపై పెద్ది టీం రెస్పాన్స్.. ఏం అన్నారంటే?

Peddi Chikiri Chikiri Song : ‘సామాన్ల’ పంచాయితీపై పెద్ది టీం రెస్పాన్స్.. ఏం అన్నారంటే?
Advertisement

Peddi Chikiri Chikiri Song : ఇండస్ట్రీ మొత్తం ‘సామన్ల’ పంచాయితీపై పడింది. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అమ్మాయిలు, హీరోయిన్ల బట్టల గురించి శివాజీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే లేపాయి. సామాన్లు అనే పదాన్ని శివాజీ వాడటంపై చాలా మంది ప్రముఖులు తప్పుబట్టారు. దీనిపై పెద్ద చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలో.. సినిమాల్లో ఈ పదాన్ని వాడిన సందర్భాలను బయటికి తీశారు. అలా…. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి వచ్చిన చికిరి చికిరి సాంగ్‌ను కూడా బయటికి తెచ్చారు. అలా… శివాజీ స్టార్ట్ చేసిన రచ్చ… రామ్ చరణ్ మూవీ మెడకు చుట్టుకుంది.

ఇటీవల రిలీజ్ అయిన ఈ చికిరి చికిరి సాంగ్ లిరిక్స్‌లో… “సరుకు సామాను చూసి.. మీసం లేచి వేసే కేక.. చికిరి చికిరి గుండె.. సురకేట్టేసాక” అంటూ ఉంటుంది. ఇందులో సరుకు, సామాను అనే పదాలపై ఇప్పుడు అభ్యంతరాలు వస్తున్నాయి. సాంగ్ బయటికి వచ్చిన తర్వాత 24 గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ చికిరి చికిరి సాంగ్‌కు కేవలం తెలుగులో 119 మిలియన్లు.. అన్ని భాషల్లో కలిపి 175 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

Advertisement

అయితే, శివాజీ కామెంట్స్ తర్వాత ఈ సాంగ్‌పై ట్రోల్స్ వచ్చాయి. రామ్ చరణ్ సాంగ్ కూడా అమ్మాయిలను కించపరిచేలా ఉంది అంటూ కొంత మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ అభిమానులు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు.

పెద్ది టీం రెస్పాన్స్..

తాజాగా పెద్ది మూవీ టీం కూడా ఈ సరుకు, సామాను ట్రోల్స్‌పై రెస్పాండ్ అయింది. ఆ ట్రోల్స్ గురించి ఆలోచించే సమయం తమకు లేదని, ప్రస్తుతం ఫోకస్ మొత్తం సినిమాపైనే ఉందని మేకర్స్ తమ సన్నిహితులతో అన్నారట. అలాగే, ఆ ట్రోల్స్ అన్నింటినీ తాము లైట్ తీసుకుంటున్నట్టు చెప్పారట. పెద్ది సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా టైం ఉందని, ఇప్పుడు వీటిపై స్పందిస్తూ టైం వృథా చేయలేమని అన్నారట.

Advertisement

కాగా, పెద్ది టీం ఇటీవలే ఢిల్లీలో షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం, తెలంగాణ, ఏపీ భవన్‌తో పాటు ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీలో షూటింగ్ చేశారు. అలాగే ప్రతిష్టాత్మక ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంలో కూడా పెద్ది మూవీ షూటింగ్ జరిగింది. ఈ సినిమాకు సంబంధించి ఇంకా 30 నుంచి 40 శాతం షూటింగ్ చేయాల్సి ఉంది. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం పెద్ది టీం రెస్పాన్స్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఇప్పుడున్న టైంలో సామాను, సరుకు ట్రోల్స్‌పై స్పందించకపోవడమే బెటర్ ఆప్షన్ అని చెబుతున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×