E-Paper
Advertisement

రూ. 300 కోట్ల కలెక్షన్ల క్లబ్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’!.. నెక్ట్స్ టార్గెట్ అదేనా..?

రూ. 300 కోట్ల కలెక్షన్ల క్లబ్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’!.. నెక్ట్స్ టార్గెట్ అదేనా..?
Advertisement

Peddi Box Office: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ (Peddi) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి వీకెండ్‌లో అదిరిపోయే కలెక్షన్లు రాబట్టిన ఈ స్పోర్ట్స్ డ్రామా, కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల క్లబ్‌ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఐదో రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో వసూళ్లలో సహజమైన తగ్గుదల కనిపించినప్పటికీ, ఆ రోజున దాదాపు రూ.12.05 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద తన పట్టును నిరూపించుకుంది.

Read also-రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైండ్ బ్లోయింగ్ రివ్యూ..

Advertisement

చిత్ర యూనిట్ మరియు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, మొదటి 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.292.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఐదో రోజు కలెక్షన్లతో కలిపి ఈ చిత్రం చాలా సులువుగా రూ.300 కోట్ల మైలురాయిని దాటేసింది. రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ సాధించిన లైఫ్‌టైమ్ కలెక్షన్లను ‘పెద్ది’ కేవలం ఐదు రోజుల్లోనే అధిగమించడం విశేషం. మొత్తంగా ఈ సినిమా అయిదు రోజులకు రూ.315 కోట్లు వసూలు చేసింది.  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన నైజాం, ఆంధ్రా ఏరియాల్లోని థియేటర్లలో ఈ సినిమాకు భారీ ఆక్యుపెన్సీ లభిస్తోంది.

Read also-Godavari Serial : ‘గోదావరి’ శంకర్ నారాయణ రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Advertisement

1980ల నాటి గ్రామీణ నేపథ్యంతో, ఆటల ద్వారా తన ఊరి ఆత్మగౌరవాన్ని కాపాడే యువకుడి కథగా వచ్చిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాగా, నటి జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు సానా సానుకూలంగా స్పందించారు. ప్రేక్షకుల మనోభావాలను గౌరవిస్తూ ఆ వివాదాస్పద సీన్లను థియేటర్ల నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, సినిమా రన్ పై ఎలాంటి ప్రభావం పడకుండా కలెక్షన్ల పరంగా ‘పెద్ది’ జోరు కొనసాగిస్తోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×