E-Paper
Advertisement

Drugs Case: డ్రగ్స్ కేసు వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన రకుల్ సోదరుడు అమన్!

Drugs Case: డ్రగ్స్ కేసు వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన రకుల్ సోదరుడు అమన్!
Advertisement

Drugs Case: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ కేసులో చిక్కుకుంటూ వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమందిపై కేసులు నమోదు కావడంతో ఇప్పటికీ విచారణలకు హాజరవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోని ఇటీవల ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్(Rakul Preeth Singh) సోదరుడు అమన్ ప్రీతిసింగ్ (Aman Preeth Singh)డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల అమన్ ప్రీత్ సింగ్ పై మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇలా అమన్ ప్రీత్ పై కేసు నమోదు కావడంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

క్వాష్ పిటిషన్ దాఖలు..

ఈ విధంగా అమన్ ప్రీత్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదు అయిన ఎఫ్ ఐ ఆర్ ను క్వాష్ చేయాలంటూ ఈయన పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ పెడ్లర్స్‌తో తనకు సంబంధం లేదని ఈయన పిటీషన్ లో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో భాగంగా అమన్ A 7 ముద్దాయిగా చేర్చారు. ఇలా ఈయన దాఖలు చేసిన పిటీషన్ విచారణ జరిగింది అయితే ఈ విచారణను తిరిగి జనవరి 9వ తేదీకి వాయిదా వేశారు. మరి జనవరి 9వ తేదీ తిరిగి విచారణ కాబోతున్న ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ప్రకటిస్తుందో తెలియాల్సి ఉంది.

ఏ 7 గా అమన్ ప్రీతిసింగ్..

Advertisement

గత ఏడాది డిసెంబర్ 19వ తేదీ హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంకు పరిధిలో పోలీసులు జరిపిన దాడులలో భాగంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికినట్లు తెలియజేశారు. ఈ కేసులో భాగంగా పట్టుబడిన కొంతమంది నిందితులను పూర్తిస్థాయిలో విచారణ జరపగా నిందితులు ప్రముఖ నటి రకుల్ సోదరుడు అమన్ పేరును కూడా ప్రస్తావించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో అమన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడమే కాకుండా మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ కేసులో భాగంగా అమన్ ను రెగ్యులర్ కస్టమర్ గా గుర్తించి ఆయనపై కేసు నమోదు చేశారు.

జనవరి 9కి వాయిదా..

Advertisement

ప్రస్తుతం అమన్ పరారీలో ఉన్నప్పటికీ ఆయనపై కేసు నమోదు కావడంతో ఈ కేసు నుంచి బయటపడటం కోసమే తెలంగాణ హైకోర్టులోకి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణలో భాగంగా పోలీసులు అమన్ న్యాయవాదుల తరఫున పెద్ద ఎత్తున వాదన కొనసాగింది. ఈ కేసులో భాగంగా అరెస్ట్ అయిన వారి స్టేట్మెంట్ ఆధారంగా అమన్ పేరును ఈ కేసులో నిందితుడిగా ఎలా చేర్చుతారు అంటూ ప్రశ్నలు వేయగా అమన్ డ్రగ్ కన్జ్యూమర్ అని పోలీసులు వాదించారు ఇలా ఇరువురి మధ్య వాదోపవాదనలు జరిగిన అనంతరం ఈ కేసును జనవరి 9వ తేదీకి వాయిదా వేశారు. ఇక అమన్ మాత్రమే కాకుండా గతంలో రకుల్ ప్రీతిసింగ్ పై కూడా ఇలాంటి డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read; MSVPG Film: ‘ మన శంకర వరప్రసాద్ గారు’ కి సీక్వెల్ ఉందా? ఈ ట్విస్ట్ ఏంటీ బాసు!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×