// // Raju Weds Rambai Director- చెప్పినట్టే చేసిన డైరెక్టర్‌.. అమీర్‌ పేట్‌ -->
E-Paper
Advertisement

Raju Weds Rambai Director: చెప్పినట్టే చేసిన డైరెక్టర్‌.. అమీర్‌ పేట్‌ AAA థియేటర్‌ ముందు..

Raju Weds Rambai Director: చెప్పినట్టే చేసిన డైరెక్టర్‌.. అమీర్‌ పేట్‌ AAA థియేటర్‌ ముందు..
Advertisement

Raju Weds Rambai Director Sailu: ఈ వారం థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో మంచి టాక్‌ అందుకున్న మూవీ ‘రాజు వెడ్స్‌ రాంబాయి’. అందరు కొత్త నటీనటులే అయినా పెద్ద హీరోల సినిమాను వెనక్కి నెట్టి మంచి వసూళ్లు చేస్తోంది. శుక్రవారం (నవంబర్‌ 21) ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిఆలో యంగ్‌ హీరోహీరోయిన్లు అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించారు. ఖమ్మంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాను డైరెక్టర్ సాయిలు తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆయన టేకింగ్‌, మేకింగ్‌కి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

అర్థనగ్నం తిరుగుతా.. ప్రమోషన్స్‌లో సవాలు

నిజ జీవిత సంఘటనను తీసుకుని మూవీని అద్భుతంగా తెరకెక్కించారంటూ ప్రేక్షకులు కొనియాడుతున్నారు. అయితే, రిలీజ్ కు ముందు మూవీ ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌ లో జరిపింది మూవీ టీం. వరుసగా ఈవెంట్స్‌, ప్రెస్‌మీట్‌ లో సందడి చేశారు. సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే తాను అమీర్‌ పేటలో చొక్కావిప్పి తిరుగుతానని సవాలు విసిరిరాడు. ఆయన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో సంచనలంగా మారాయి. డైరెక్టర్‌ కామెంట్స్‌ ప్రతి ఒక్కరు షాక్‌ అయ్యారు. ఆయన అలాంటి బోల్డ్‌ సవాలు చేయడంతో రాజు వెడ్స్‌ రాంబాయి కంటెంట్‌ నిజంగానే అంత దమ్ముందా అని అంత ఆలోచనపడ్డారు. ఆయన కామెంట్స్‌ కోసమైన ఒకసారి సినిమా చూడాలనుకుని థియేటర్‌కు వచ్చిన ఆడియన్స్‌ కూడా ఉన్నారు.

సత్యం థియేటర్ ముందు

Advertisement

అలా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకుంది. దీంతో డైరెక్టర్‌ అమీర్ పేట్ వచ్చాడు. ప్రజలు తమ మాట ప్రకారం సినిమాను హిట్‌ చేశారని, ఇక తన మాట ప్రకారం అమీర్‌ పేట్‌ వచ్చానన్నారు. అక్కడి ఏషియన్ AAA సత్యం థియేటర్‌ ముందు ఆయన డబ్బుతో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. “మీరు (ఆడియన్స్) ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇక నేను కూడా మాట నిలబెట్టుకోవాలి కదా. చెప్పినట్టుగానే అమీర్‌ పేట్‌ వచ్చాను. ఇక్కడ మన సత్యం థియేటర్ ముందు ఉన్నా. ఇప్పుడు మీ కోసం బ్యాండ్‌ కొడుతున్నా” అంటూ థియేటర్‌ ముందు డబ్బు వాయిస్తా మూవీ సక్సెస్‌ ని సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

కథేంటంటే!

Advertisement

2010లో ఓ మారుమూల గ్రామంలో బ్యాండ్ కొడుతూ జీవనం సాగించే యువకుడు రాజు (అఖిల్ రాజ్) అదే ఊరికి చెందిన అమ్మాయి రాంబాయి (తేజస్వి రావు) ని ఎంతో గాఢంగా ప్రేమిస్తాడు. కానీ రాజు తండ్రి రమేష్ (శివాజీ రాజా) తన కొడుకును హైదరాబాద్ పంపి మంచి పని చేసుకోవాలని ఆశపడతాడు. మరోవైపు రాంబాయి తండ్రి వెంకన్న (చైతూ జొన్నలగడ్డ) తన కూతురికి గవర్నమెంట్ సంబంధం మాత్రమే చేయాలని కలలు కంటాడు. ఈ క్రమంలో ప్రేమలో రాజు, రాంబాయి ప్రేమ విషయం తెలిసి పెద్దవాళ్లు ఏం చేశారు? వారి పెళ్లి ఎలా జరిగింది? తమ ప్రేమను గెలిపించేందుకు వారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఈ క్రమంలో సొంత కూతురికే వెంకన్న తలపెట్టిన హానీ? ఏంటో తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Also Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పేరు వెనక ఉన్న రహస్యం, మొత్తానికి బయట పెట్టిన కొండన్న

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×