// // Coolie Gold Rings Sale - బాబోయ్‌ కూలీ మేనియా మామూలుగా లేదు.. చివరికి గోల్డ్‌ రింగ్‌ని కూడా వాడేసారు.. -->
E-Paper
Advertisement

Coolie Gold Rings Sale: బాబోయ్‌ కూలీ మేనియా మామూలుగా లేదు.. చివరికి గోల్డ్‌ రింగ్‌ని కూడా వాడేసారు..

Coolie Gold Rings Sale: బాబోయ్‌ కూలీ మేనియా మామూలుగా లేదు.. చివరికి గోల్డ్‌ రింగ్‌ని కూడా వాడేసారు..
Advertisement

Coolie Gold Rings Sale: ప్రస్తుతం సౌత్‌ బాక్సాఫీసు వద్ద విపరీతమైన బజ్‌ ఉన్న చిత్రం ‘కూలీ‘. ఈ సినిమా సౌత్‌ ఆడియన్స్‌ అంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగష్టు 14న థియేటర్లలో రచ్చ చేసేందుకు ఫ్యాన్స్‌ అంత ప్రీపేర్‌ అవుతున్నారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది ‘కూలీ‘. ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రచార పోస్టర్స్‌, టీజర్‌ ట్రైలర్‌ తర్వాత మూవీపై బజ్‌ మరింత పెరిగింది. ముఖ్యంగా ట్రైలర్‌ కూలీపై అంచనాలను ఆకాశానికి తాకాయి. ప్రస్తుతం సినిమాకు ఉన్న బజ్ చూస్తుంటే బాక్సాఫీసు వద్ద వెయ్యి కోట్లు కొట్టడం గ్యారేంటి అన్నట్టుగా ఉంది.

Advertisement

కోలీవుడ్ కల నెరవేరేనా

ఈ సినిమాపై ఫ్యాన్స్‌, మూవీ టీం మాత్రమే కోలీవుడ్‌ ఇండస్ట్రీ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రంతోనే అయినా కోలీవుడ్‌ కలగా ఉన్న వెయ్యి కోట్లు వస్తాయని ఆశిస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూలీ మేనియా మామూలుగా లేదు. ఇక తలైవా సినిమా అంటే సెలవులు ఉండాల్సిందేగా. మూవీ రిలీజ్‌ సందర్భంగా ఆగస్టు 14న రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంస్థలు సెలవులు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు సెలవులు ప్రకటించాయి. అలాగే తమ ఎంప్లాయిస్‌కి ఫ్రీ టికెట్స్‌ కూడా పంపిణీ చేస్తున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనూ కూలీ సత్తా చాటుతోంది.

Advertisement

టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే ఓవర్సిస్‌లో ప్రీమియర్స్‌ టికెట్‌ ప్రీ సేల్‌లో కూలీ.. 2 మిలియన్లకు పైగా డాలర్ల బిజినెస్‌ చేసింది. నార్త్‌ అమెరికాలో ప్రీ సేల్‌లో ఈ రేంజ్‌లో బిజినెస్‌ చేసిన తొలి తమిళ చిత్రం కూలీ రికార్డు నెలకొల్పింది. ఇలా కూలీ మూవీ ఒక్కొక్కొ రికార్డు బ్రేక్‌ చేస్తూ వెళుతుంది. ఇప్పటికే వివిధ ప్రమోషన్స్‌తో మూవీ టీం కూలీపై హైప్‌ పెంచుతోంది. మరోవైపు ఫ్యాన్స్‌ కూడా తమదైన స్టైల్లో మూవీకి బజ్‌ పెంచుతున్నారు. తాజాగా గోల్డ్‌ స్మిత్‌ వ్యాపార కూలీ పేరుతో బంగారు రింగ్ తయారు‌ చేసి మూవీ హైప్‌ని నెక్ట్స్‌ లెవెల్‌కి తీసుకువెళ్లాడు.  కూలీ ఈ బంగారు రింగ్‌ మేకింగ్‌ వీడియో షేర్‌ చేసి నెటిజన్స్‌, ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. అల్లు బబ్లూ అనే ట్విటర్‌ యూజర్‌ కూలీ గోల్డ్‌ రింగ్స్ సేల్ కి పెట్ట‌ మేకింగ్‌ వీడియోను షేర్‌ చేశాడు.

కూలీ గోల్డ్ సేల్

ఈ రింగ్ తయారి కోసం గోల్డ్‌ స్మిత్‌ ఎంతగా కష్టపడ్డాడో చూపిస్తూ మేకింగ్‌ వీడియోలో చూపించారు. మూవీ రిలీజ్‌ సందర్భంగా కూలీ పేరుతో గోల్డ్‌ రింగ్‌ తయారు చేసి దానిని సేల్‌కి పెట్టారు. ఈ మేరకు మేకింగ్‌ వీడియో షేర్‌ చేస్తూ.. ఈ రింగ్ కావాలనుకునేవారికి కోసం సదరు జువెల్లరి షాప్‌ డిటైయిల్స్‌ కూడా పెట్టారు. కూలీ రింగ్స్‌ కావాలనుకునేవారు 1947 ‘F GOLD SMITH జువెల్లరి షాప్‌ని సంప్రదించాలని కాంటాక్ట్‌ నెంబర్‌ కూడా ఇచ్చారు. దీంతో గోల్డ్‌ రింగ్‌ కోసం రజనీ ఫ్యాన్స్‌ పోటీ పడుతున్నారట. సదరు గోల్డ్ షాప్‌కు వరుసగా కాల్స్‌ వస్తున్నట్టు తెలుస్తోంది. ఇటూ మేకర్స్‌ ప్రమోషన్స్‌ చేస్తుంటే.. మరోవైపు ఫ్యాన్స్‌ కూడా కూలీపై ఇలా బజ్ క్రియేట్ చేయడం కొత్తగా ఉందని. ఇలాంటి ప్రమోషన్స్‌, హైప్‌ తొలిసారి కూలీ మూవీకే చూస్తున్నాం అంటున్నారు. కాగా యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం గోల్డ్ స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో రజనీ ‘దేవా‘ పాత్రలో గోల్డ్‌ స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×