// // Rajinikanth: మరో గౌరవం అందుకున్న తలైవా.. వందేళ్ళ చరిత్రలో మొదటిసారి ఇలా! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Rajinikanth: మరో గౌరవం అందుకున్న తలైవా.. వందేళ్ళ చరిత్రలో మొదటిసారి ఇలా!

Rajinikanth: మరో గౌరవం అందుకున్న తలైవా.. వందేళ్ళ చరిత్రలో మొదటిసారి ఇలా!
Advertisement

Rajinikanth: కోలీవుడ్ స్టార్ నటుడు రజనీకాంత్ (Rajinikanth)ఇటీవల తన 50 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక సాధారణ బస్ కండక్టర్ గా తన జీవితం కొనసాగుతున్న నేపథ్యంలో సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొన్న  రజనీకాంత్ ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఈ 50 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఎన్నో పురస్కారాలను, గౌరవాలను సొంతం చేసుకున్నారు.

హిందుస్థాన్ టైమ్స్ ఆంగ్లపత్రిక..

ఇక ఇటీవల రజనీకాంత్ తన 50 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రజినీకాంత్ 50 సంవత్సరాల కెరియర్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈయన గోవాలో జరగబోతున్న IFFI 2025 అవార్డు (IFFI 2025 Awards)వేడుకలలో సత్కారం అందుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రజనీకాంత్ మరో గౌరవాన్ని అందుకున్నారు.  ఈయన తన 50 సంవత్సరాల సినీ ప్రస్థానం పూర్తి అయిన సందర్భంగా హిందుస్తాన్ టైమ్స్(Hindustan Times) ఆంగ్ల పత్రిక తన ఫ్రంట్ పేజీలో రజనీకాంత్ ఫోటోని ప్రచురిస్తూ ఆయన సినీ కెరియర్ కు సంబంధించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తొలి హీరోగా రజనీకాంత్..

Advertisement

హిందుస్థాన్ టైమ్స్ ఆంగ్లపత్రికకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ఈ 100 సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు ఈ పత్రిక ఏ హీరో ఫోటోలను ఇలా ఫ్రంట్ పేజీలో ప్రచురించలేదు. ఇలా ఫ్రంట్ పేజీలో ప్రచురించిన తొలి హీరోగా రజనీకాంత్ ఈ గౌరవాన్ని అందుకోవటం విశేషం. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు సూపర్ స్టార్ రజినీకాంత్ గొప్పదనం గురించి తెలియజేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. ఇలా ఈయన ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా, ఇప్పటికీ ఏమాత్రం సినిమాల విషయంలో వెనకడుగు వేయకుండా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

రజనీకాంత్ కమల్ హాసన్ కాంబో…

Advertisement

ప్రస్తుతం రజనీకాంత్ తన సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదివరకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా అనంతరం ఈయన కమల్ హాసన్ నిర్మాణంలో కొత్త సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి దర్శకుడు తప్పుకోవడంతో ఈ సినిమా మరికాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు దర్శకుడి ఎంపిక విషయంలో చిత్ర నిర్మాతలు బిజీగా ఉన్నారు.

Also Read: Tharun Bhascker: హీరోయిన్‌తో ప్రేమాయణం.. ఎంజాయ్ చేస్తున్న అంటూ స్టేజ్‌పైనే క్లారిటి ఇచ్చిన డైరెక్టర్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×