// //
Rajinikanth: సినిమా ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సౌత్ సినీ ఇండస్ట్రీలో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)నటన ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే రజనీకాంత్ కు నటనలో మెలకువలు నేర్పిన గురువు మరణించడంతో రజనీకాంత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రజనీకాంత్ ఇండస్ట్రీలోకి రావడానికి ప్రముఖ గురువు, డైరెక్టర్ కె ఎస్ నారాయణ స్వామి (92) వద్ద శిక్షణ తీసుకున్నారు. ఇలా ఆయన వద్ద శిష్యరికం పొందిన రజనీకాంత్ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.
ఇకపోతే తాజాగా నారాయణస్వామి (K S.Narayana Swamy)మరణించిన విషయం తెలియడంతో రజనీకాంత్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆయనకు నివాళులు అర్పించి సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నారాయణస్వామి వద్ద కేవలం రజనీకాంత్ మాత్రమే కాకుండా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా శిష్యరికం పొందారు. ఇక నారాయణస్వామి గురువుగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా ఇండస్ట్రీలో కొనసాగారు ఇండస్ట్రీలో ఈయనని అందరూ కె ఎస్ గోపాల్ అనే పేరుతో పిలుస్తూ ఉండేవారు.
ఇక నారాయణస్వామి మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ మద్రాస్ దూరదర్శన్ కేంద్రానికి డైరెక్ట్ గా కూడా పనిచేశారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు చేసిన నారాయణస్వామి మరణించడంతో ఆయన వద్ద శిష్యరికం పొందిన వారందరూ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఇక రజనీకాంత్ అలాగే బాలచందర్ వంటి దిగ్గజాలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా నారాయణస్వామికి దక్కింది. 92 సంవత్సరాల వయసులో ఉన్న నారాయణస్వామి వృద్ధాప్య రీత్యా గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వృద్ధాప్య సమస్యలతోనే ఈయన తుది శ్వాస విడిచారు.
కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్..
ఇక ఈయన మరణ వార్త తెలియడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఇతర నటీనటులు ఈయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.. ఇక రజనీకాంత్ సినిమా కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ నిర్మాణంలో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని అనుకొని కారణాలవల్ల ఈ సినిమా నుంచి దర్శకుడు సుందర్ తప్పుకోవడంతో మరొక దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల రజనీకాంత్ కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు ఇక త్వరలోనే జైలర్ 2 కూడా విడుదల కానుంది.
Also Read : Mega 158: గ్యాంగ్ స్టర్ డ్రామాగా మెగా 158..బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!