E-Paper
Advertisement

బాలయ్య సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా రాజశేఖర్?.. కొరటాల శివ స్కెచ్ మామూలుగా లేదుగా!

బాలయ్య సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా రాజశేఖర్?.. కొరటాల శివ స్కెచ్ మామూలుగా లేదుగా!
Advertisement

Rajasekhar Villain: దేవర ..ఈ సినిమా సాలిడ్ హిట్ అయినా సీక్వెల్ ని సెట్స్ మీదకి తీసికెళ్ళలేకపోయాడు డైరెక్టర్ కొరటాల. అయితే అది లేకపోతేనేం ఇది ఉందంటూ బాలయ్యతో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కి శ్రీకారం చుట్టాడు ఈ క్రేజీ డైరెక్టర్.ఇక ఇదిలా ఉంటె తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఒక క్రేజీ న్యూస్ ఇపుడు నెట్టింటిని షేక్ చేస్తుంది.అదే ఈ సినిమాలో విలన్ గా రాజశేఖర్ నటిస్తున్నాడని . యస్..ఈ మధ్యే దర్శకుడు కొరటాల శివ రాజశేఖర్‌ను కలిసి లైన్ వినిపించారని, నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ క్యారెక్టర్‌లోని డెప్త్ నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

టాప్ హీరోల సినిమాల్లో మెయిన్ విలన్‌గా

ఒకవేళ ఈ కాంబినేషన్ గనుక అధికారికంగా సెట్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద పూనకాలు గ్యారెంటీ అని చెప్పొచ్చు. బాలయ్య మార్క్ మాస్ డైలాగ్స్‌కు తోడు రాజశేఖర్ క్లాసిక్ విలనిజం తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. గత కొంతకాలంగా రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్న పాత్రలపై దృష్టి పెట్టిన సంగతి తెల్సిందే.
కేవలం హీరోగానే కాకుండా, కథ డిమాండ్ చేస్తే నెగెటివ్ రోల్స్ మరియు కీలకమైన క్యారెక్టర్లు చేయడానికి ఆయన సై అంటున్నారు.

Advertisement

also read :అరిచే కుక్కలు కరవవు.. ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్‌కు వరలక్ష్మి శరత్ కుమార్ పవర్‌ఫుల్ పంచ్!
ఇందుకు నిదర్శనంగా ఇటీవలే శర్వానంద్ హీరోగా వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ చిత్రంలో ఆయన పోషించిన కోచ్ పాత్రకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి కూడా.ఇక అదే ఉత్సాహంతో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ మూవీలోనూ ఆయన ఒక అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో మెయిన్ విలన్‌గా చేయాలనేది తనకున్న బలమైన కోరిక అని రాజశేఖర్ పలు మార్లు చెప్పాడు కూడా.

 యాంగ్రీ యంగ్ మ్యాన్ కి పర్‌ఫెక్ట్ ప్లాట్ ఫామ్

ఈ రకంగా చూస్తె బాలయ్య సినిమా ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ కి పర్‌ఫెక్ట్ ప్లాట్ ఫామ్ అనే చెప్పాలి. కొరటాల శివ తన సినిమాల్లో విలన్ పాత్రలను ఎంతో స్టైలిష్‌గా, అంతే పవర్‌ఫుల్‌గా అంతకు మించి సెటిల్డ్ గా డిజైన్ చేయడం మనం చూశాం కూడా. ‘మిర్చి’లో సంపత్ రాజ్, ‘శ్రీమంతుడు’లో జగపతిబాబు పాత్రల తరహాలోనే రాజశేఖర్ క్యారెక్టర్‌ను కూడా నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్.
also read :ప్రేమలు ఓయో రూముల్లోనే ఎండ్ అవుతున్నాయి.. అల్లు అరవింద్ బోల్డ్ కామెంట్స్.

Advertisement

ఇక బాలయ్య సినిమాకి వస్తే… ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న కొత్త సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.తాజాగా బాలయ్య బర్త్ డే సందర్భంగా వదిలిన గ్లిమ్ప్స్ నెట్టింట్లో వైరల్ అయింది కూడా .ఇక ఈ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ కనిపించనున్న సంగతి తెల్సిందే.
‘వేదం’ లాంటి సినిమాల్లో తన నటనతో మెప్పించిన మంచు మనోజ్, బాలయ్యకు సై అంటే సై అనే రేంజ్‌లో విలనిజం పండించబోతుండటం విశేషం. ఇలా ఒకవైపు మంచు మనోజ్, మరోవైపు రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోలు బాలకృష్ణ సినిమాల్లో విలన్ వేషాలు వేయడం చూస్తుంటే టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ మొదలైనట్టే కనిపిస్తుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×