E-Paper
Advertisement

విజయ్ దేవరకొండ సినిమాను రిజక్ట్ చేసిన కోలీవుడ్ స్టార్ యాక్టర్.. ఆ స్టార్ హీరోకి ఛాన్స్..

విజయ్ దేవరకొండ సినిమాను రిజక్ట్ చేసిన కోలీవుడ్ స్టార్ యాక్టర్.. ఆ స్టార్ హీరోకి ఛాన్స్..
Advertisement

Rowdy Janardhana Villain: విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రవికిరణ్ కోలా దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ (దిల్ రాజు) నిర్మిస్తున్న భారీ రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రౌడీ జనార్దన’ (Rowdy Janardhana). ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సమాచారం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రౌడీ జనార్దన’. పక్కా మాస్ అండ్ ఇంటెన్స్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోకి గట్టి పోటీ ఇచ్చే విలన్ పాత్ర కోసం చిత్ర బృందం చాలా రోజులుగా కసరత్తులు చేస్తోంది.

Read also-కొడుకు వాయువ్ తేజ్‌తో వరుణ్ తేజ్ క్యూట్ మూమెంట్స్.. వైరల్ అవుతున్న ఫోటోస్!

విజయ్ సేతుపతి నో.. కారణం ఇదేనా?

Advertisement

ఈ చిత్రంలోని విలన్ పాత్రను దర్శకుడు రవికిరణ్ కోలా.. కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని మనసులో ఉంచుకునే రాసుకున్నారట. పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ కారణంగా విజయ్ సేతుపతి అయితేనే పర్ఫెక్ట్ న్యాయం చేయగలరని భావించిన చిత్ర యూనిట్ ఆయనను సంప్రదించింది. ఇందుకోసం ఏకంగా రూ. 20 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ను కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం.

అయితే, విజయ్ సేతుపతి ఈ క్రేజీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. గతంలో ‘ఉప్పెన’, ‘విక్రమ్’, ‘జవాన్’ వంటి సినిమాల్లో విలన్‌గా మెప్పించిన సేతుపతి.. ఈ మధ్య కాలంలో నెగెటివ్ రోల్స్‌కు దూరంగా ఉంటున్నారు. విలన్ పాత్రలు ఎక్కువగా చేయడం వల్ల తన హీరో ఇమేజ్‌పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతోనే ఆయన ఈ భారీ రెమ్యునరేషన్‌ను కూడా వదులుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

Advertisement

Read also-‘నాన్న చిరంజీవి నుంచి నేర్చుకున్న గొప్ప పాఠం అదే’.. రామ్ చరణ్ ఎమోషనల్..

సీన్‌లోకి ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’

విజయ్ సేతుపతి నో చెప్పడంతో చిత్ర యూనిట్ మరో పవర్‌ఫుల్ ఆప్షన్ వైపు మొగ్గు చూపింది. సీనియర్ హీరో, టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ డా. రాజశేఖర్ అయితే ఈ పాత్రకు సరికొత్త ఊపు తీసుకురాగలరని భావించి ఆయనను సంప్రదించారు. కథ తన పాత్రలోని వైవిధ్యం నచ్చడంతో రాజశేఖర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా రాజశేఖర్ విలన్ లేదా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించినా, సరైన స్క్రిప్ట్ కుదరలేదు. కానీ ‘రౌడీ జనార్దన’లో ఆయన క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా, హీరో పాత్రకు దీటుగా ఉండబోతోందని సమాచారం.

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను ఢీకొట్టబోతుండటం ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఒకవైపు విజయ్ దేవరకొండ రస్టిక్ లుక్, మరోవైపు రాజశేఖర్ మార్క్ ఇంటెన్సిటీ వెండితెరపై హై-వోల్టేజ్ యాక్షన్‌ను తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2026 చివరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×