E-Paper
Advertisement

Varanasi Budget: ఓరి దేవుడా ‘వారణాసి’ బడ్జెట్ ‘ఆర్ఆర్ఆర్’ గ్రాస్ కలెక్షన్లకు సమానమా?.. అసలు ఎంతంటే?

Varanasi Budget: ఓరి దేవుడా ‘వారణాసి’ బడ్జెట్ ‘ఆర్ఆర్ఆర్’ గ్రాస్ కలెక్షన్లకు సమానమా?.. అసలు ఎంతంటే?
Advertisement

Varanasi Budget: దర్శక థీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ చిత్రం ‘వారణాసి’ (Varanasi). ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 1200 నుండి 1300 కోట్ల మధ్య ఉండబోతుందని ట్రేడ్ వర్గాల టాక్. ఇది రాజమౌళి గత చిత్రం ‘RRR’ మొత్తం కలెక్షన్లతో సమానం కావడం విశేషం. అంటే, ఒక సినిమా సాధించిన అత్యున్నత వసూళ్లను రాజమౌళి తన తదుపరి సినిమా బడ్జెట్‌గా పెడుతున్నారన్నమాట. రాజమౌళి ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయి “ఇండియానా జోన్స్” తరహాలో ఒక గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేశారు. కథలో భాగంగా ఆఫ్రికా అడవులతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, విలన్ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తున్నారు.

Read also-Tamannaah: మైసూర్ శాండిల్ సోప్.. తమన్నా ఎంపికపై మంత్రి కీలక కామెంట్స్!

రామాయణం రిఫరెన్స్..

Advertisement

ఈ సినిమాను తొలిసారిగా 1.43:1 IMAX ఫార్మాట్‌లో చిత్రీకరించబోతున్నారు. ఇలాంటి టెక్నాలజీతో వస్తున్న మొదటి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. కథ అడ్వెంచర్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగినప్పటికీ, రాజమౌళి మార్క్ ఎమోషన్స్, రామాయణంలోని కొన్ని అంశాల స్ఫూర్తితో ఈ సినిమా ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఈ భారీ విజువల్ వండర్‌ను ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Read also-Vijay – Rashmika: రష్మికతో పెళ్లి వార్తల వేళ.. మరో యువతితో చనువుగా విజయ్.. ఫోటోలు వైరల్!

బడ్జెట్ కేటాయింపులు ఇలా..

Advertisement

ఈ రూ. 1300 కోట్లలో సింహభాగం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అంతర్జాతీయ లొకేషన్లలో షూటింగ్ కోసం ఖర్చు చేయబోతున్నారు. రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరూ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోకుండా, లాభాల్లో వాటా (Profit Sharing) తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆ మొత్తాన్ని కూడా మేకింగ్ క్వాలిటీ కోసమే వినియోగిస్తున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వస్తున్న ఈ నంబర్లు చూస్తుంటే, బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను మహేష్ బాబు సినిమా తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా గ్లోబల్ రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×