E-Paper
Advertisement

SSMB29 : ఇదేం ట్విస్ట్.. పాస్ పోర్ట్ లను పంచుతున్న జక్కన్న.. పిచ్చెక్కించే న్యూస్..

SSMB29 : ఇదేం ట్విస్ట్.. పాస్ పోర్ట్ లను పంచుతున్న జక్కన్న.. పిచ్చెక్కించే న్యూస్..
Advertisement

SSMB29 : RRR తర్వాత డైరెక్టర్ రాజమౌళి ఏ హీరోతో సినిమా చేస్తాడా అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జక్కన్నతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కట్టారు. కానీ మహేష్ బాబుతో సినిమాను అనౌన్స్ చేశాడు రాజమౌళి.. ఈ మూవీని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తామా అని మహేష్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి గత కొన్ని రోజులుగా వరుస అప్డేట్స్ వస్తున్నాయి.. తాజాగా ఈ మూవీ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ శనివారం జరగబోయే గ్లోబ్ ట్రాట్టింగ్ ఈవెంట్ కు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఈవెంట్ కోసమే పాస్ పోర్ట్ లను రెడీ చేశారు. ఆ పాస్ పోర్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

గ్లోబ్ ట్రాట్టింగ్ ఈవెంట్ కోసం పాస్ పోర్ట్స్..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఏం చేసినా సరే అది ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఏ డైరెక్టర్లకు రాని ఆలోచన ఈయనకు రావడం విశేషం.. గతంలో వచ్చిన సినిమాల ఈవెంట్లతో పోలిస్తే మహేష్ బాబు సినిమా ఈవెంట్ హైలెట్గా నిలవనుందని తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్ కు పాసుల జారీ మొదలైపోయింది. ఏదో ఆషామాషీగా రెగ్యులర్ ఈవెంట్ లకు చూసే కార్టు ముక్కలు పెట్టలేదు. ఏకంగా పాస్ పోర్ట్ తరహాలో పసుపుపచ్చ రంగులో చిన్న బుక్ ప్రింట్ చేసి అందులో ఈవెంట్ వివరాలు, డైరెక్షన్లు, గూగుల్ మ్యాప్ ఫోటోతో పాటు క్యూఆర్ కోడ్ కూడా పెట్టారు. చిన్న బుక్ లాంటి ఈ పాస్ పోర్ట్ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ బుల్లి పాస్ పోర్ట్ ఎలా ఉందో చూసేయ్యండి..

Advertisement

Also Read :‘కాంత ‘ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

ఎంతైన జక్కన్న ఆలోచనలే వేరప్పా.. 

టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలకు డిమాండ్ ఏ రేంజులో ఉంటుందో చెప్పనక్కర్లేదు.. డిఫరెంట్ స్టోరీలతో మొదటి నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంటాడు. మూవీ మొదలైనప్పటి నుంచి థియేటర్లలోకి వచ్చేవరకు అన్ని ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాడు. ఎంత ఖర్చవుతోందనేది ఇప్పుడే అంచనాకు రాలేం కానీ పైపైన లెక్కేసినా కోట్ల రూపాయల వ్యయం కళ్ళముందు కనిపిస్తోంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ ఈ ఈవెంట్ ను ప్రత్యేక్ష ప్రసారం చేస్తుంది. క్రికెట్ వీక్షణ లాగే ఎన్ని కోట్ల మంది చూస్తున్నారో ప్రతి సెకను డిస్ప్లే అయ్యే నెంబర్ ని కూడా స్క్రీన్ మీద చూపించనుందని తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఇతర ప్యాన్ ఇండియా సినిమాల డైరెక్టర్లు, హీరోలు రాజమౌళిలాగా ఆలోచించడం కష్టమనే చెప్పాలి. జక్కన్న ఆలోచనలే వేరప్పా. ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా జక్కన్నకు ఎలాంటి రికార్డులను అందిస్తుందో చూడాలి..

Advertisement

?igsh=eWRoY3NqY3k1ZDc4

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×