E-Paper
Advertisement

HBD Rajamouli: సినీ పరిశ్రమనే శాసించిన జక్కన్న.. రెమ్యూనరేషన్, ఆస్తులు, కార్ల జాబితా ఇదే!

HBD Rajamouli: సినీ పరిశ్రమనే శాసించిన జక్కన్న.. రెమ్యూనరేషన్, ఆస్తులు, కార్ల జాబితా ఇదే!
Advertisement

HBD Rajamouli:అద్భుతమైన డైరెక్షన్ విలువలతో తెలుగు సినిమా పరిశ్రమనే కాదు పాన్ ఇండియా సినిమానే శాసించిన జక్కన్న (Rajamouli ) పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారగా.. అందులో ఆయన ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు? ఆయన ఆస్తుల వివరాలు ఏంటి? ఆయన కార్ గ్యారేజీలో ఉండే అద్భుతమైన కార్ కలెక్షన్.. ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రాజమౌళి రెమ్యూనరేషన్..

అసిస్టెంట్ ఎడిటర్ గా తన కెరియర్ మొదలుపెట్టిన రాజమౌళి.. మొదటిసారి 50 రూపాయలను తన మొదటి రెమ్యునరేషన్ గా తీసుకున్నారట. ఇటీవల ‘కుబేర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈ విషయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత ‘శాంతి నివాసం’ సీరియల్ ఎపిసోడ్ కి డైరెక్టర్గా కెరియర్ మార్చుకొని.. ఆ సీరియల్ తో మంచి సక్సెస్ అందుకున్నారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఈ సీరియల్ కి డైరెక్టర్గా పనిచేసిన ఈయన.. కే.రాఘవేంద్రరావు (K . Raghavendra Rao) పర్యవేక్షణలోనే పనిచేశారు. ఈ సీరియల్స్ కి పనిచేస్తున్న సమయంలో ఒక్కొక్క ఎపిసోడ్ కి 2000 రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ అనే సినిమాతో డైరెక్టర్గా తొలి అడుగులు వేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ (Jr.NTR) హీరోగా నటించిన విషయం తెలిసిందే. అలా మొదలైన ఆయన సినీ ప్రయాణం నేడు ప్రపంచ స్థాయి గుర్తించేలా పేరు లభించింది. ఒక్కో సినిమాకు రూ.50 – రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు రాగా.. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న ఎస్ ఎస్ ఎం బి 29 (SSMB 29) కోసం రెమ్యూనరేషన్ కాకుండా 40% లాభాలలో వాటా తీసుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

ALSO READ:Film industry: గుండెపోటుతో మరో స్టార్ హీరో మృతి.. చిన్న వయసులోనే!

రాజమౌళి ఆస్తుల వివరాలు..

రాజమౌళికి హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది. హైదరాబాదు తో పాటు ఇతర ప్రదేశాలలో కూడా భూములపై పెట్టుబడులు పెట్టారు. సినిమాల ద్వారానే కాకుండా ఇతర రంగాలలో పెట్టుబడులు, యాడ్స్ లో కూడా నటిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. అలా ఇప్పటివరకు సుమారుగా 200 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రాజమౌళి కార్ కలెక్షన్స్..

Advertisement

రాజమౌళి కారు కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయం అందుకున్న తర్వాత వోల్వో XC 40 SUV మోడల్ ను కొనుగోలు చేశారు. ఈ కారు కొనడానికంటే ముందు బీఎండబ్ల్యూ 7 సీరీస్ కారు కొనుగోలు చేసిన ఈయన రేంజ్ రోవర్ కారును కూడా దక్కించుకున్నారు.

రాజమౌళి ప్రస్తుత సినిమాలు..

రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు (Maheshbabu)తో ఎస్ ఎస్ ఎం బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఆఫ్రికన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం 2027లో ముందుకు రానుంది. ఇందులో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×