E-Paper
Advertisement

Baahubali : జై మాహిష్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపిన జక్కన్న, ఇది మరో చరిత్ర

Baahubali : జై మాహిష్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపిన జక్కన్న, ఇది మరో చరిత్ర
Advertisement

Baahubali : తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని అధ్యాయం బాహుబలి. ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే సినిమా సృష్టించిన సంచలనం అలాంటిది. నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు ప్రపంచ సినిమా చూస్తుంది అంటే దానికి కారణం బాహుబలి అనే సినిమా. సినిమా తర్వాతే తెలుగు సినిమా భారతీయ సినిమాగా మారిపోయింది.

అయితే బాహుబలి 2 సినిమాలను కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షోలు ఆల్రెడీ మొదలైపోయాయి. సినిమా మీద విపరీతమైన అంచనాలు కూడా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూశారు. ఇక తాజాగా ఎస్ఎస్ రాజమౌళి కూడా హైదరాబాదులోని ప్రసాద్ ఐమాక్స్ లో బాహుబలి సినిమాను చూస్తున్నారు. ఈ సినిమాను చూడడానికి వచ్చిన రాజమౌళి ప్రేక్షకులతో మాట్లాడారు.

జై మాహిష్మతి

Advertisement

నాతోటి మాహిష్మతి ప్రజలందరికీ శుభాభివందనాలు. మన రాజ్యంలో పంటలు ఎలా పండుతున్నాయి.? వ్యాపారాలు బాగా జరుగుతున్నాయా? రాజమాత దేవసేన ఆధ్వర్యంలో మహేంద్ర బాహుబలి పాలన ఎలా ఉంది.? ముసలవాడు ఏం చేయాలో తెలియక ఆ బిజ్జలదేవుడు అటూ ఇటూ తిరుగుతున్నాడు బాగానే ఉందా? నామీద బాహుబలి మీద ఎంతో ప్రేమ చూపించారు.

10 సంవత్సరాలైనా కూడా ఎక్కడా మీ ప్రేమ తగ్గలేదు మీ అభిమానం తగ్గలేదు. నా మాటల్లో మీ మీద ఉన్న ప్రేమను చెప్పలేను. మీ అందరికీ థాంక్యూ సో మచ్. మీకు నచ్చిన సీన్స్ అన్నీ కూడా ఉంచాను అని అనుకుంటున్నాను. జై మాహిష్మతి సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని రాజమౌళి మాట్లాడారు.

స్పీచ్ తో సినిమా స్టోరీ

Advertisement

బాహుబలి సినిమా స్టోరీ ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆ పాత్రలు అలా మైండ్ లో మెదులుతూ ఉంటాయి. పది సంవత్సరాల తర్వాత సినిమా చూసే ప్రేక్షకులకు ఆ సినిమాలోని పాత్రలను గుర్తు చేస్తూ మాహిష్మతి సామ్రాజ్యం గురించి మరోసారి రాజమౌళి చెప్పటం అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Baahubali The Epic : బాహుబలి రీ రిలీజ్ అరాచకం, మాస్ జాతరకు ఇది పెద్ద దెబ్బే

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×