// //
Paanch Minaar First Day Collections: ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నటుడు రాజ్ తరుణ్(Raj Tarun). మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ కుర్ర హీరోకి అనంతరం తెలుగులో అవకాశాలు వచ్చాయి కానీ ఇటీవల కాలంలో ఈయన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇటీవల రాజ్ తరుణ్ తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల కారణంగా రాజు తరుణ్ సినిమాలపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక డిజాస్టర్ గా నిలుస్తున్నాయి..
తాజాగా రాజ్ తరుణ్ “పాంచ్ మినార్” (Paanch Minaar)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రామ్ కుడుముల (Ram Kudumula) దర్శకత్వంలో రాజ్ తరుణ్, రాశి సింగ్ (Rasi Singh) జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా ఎప్పటిలాగే ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మాధవి, ఎంఎస్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు కేవలం 36 లక్షల కలెక్షన్లతో సరిపెట్టుకొని భారీ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. కనీసం అరకోటి కలెక్షన్లను కూడా రాబట్టుకోలేకపోవడంతో నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలు తప్పవనే చెప్పాలి.
రాజ్ తరుణ్ సినిమాలకు ఇటీవల పెద్దగా ఆదరణ లేకపోయినప్పటికీ ఆయనకు సినిమా అవకాశాలను కల్పిస్తూ నిర్మాతలు వరుసగా నష్టాలను ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా ఎమ్మెస్ రెడ్డికి సైతం ఇదే పరిస్థితి ఎదురు కాబోతుందని తెలుస్తోంది. మొదటిరోజు కేవలం 36 లక్షల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా కూడా ఇంతకుమించి కలెక్షన్లను రాబట్టకపోవచ్చు అని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు మంచి టాక్ రావడంతో రోజురోజుకు స్క్రీన్ లను పెంచుతున్న నేపథ్యంలో రాజ్ తరుణ్ సినిమాకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.
ఇబ్బందులలో రాజ్ తరుణ్ కెరియర్..
ఇలా రాజ్ తరుణ్ నటించిన వరుస సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో సోషల్ మీడియా వేదికగా విభిన్న రీతిలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక రాజ్ తరుణ్ సినిమాలు చేయటం మానుకుంటే మంచిదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అజయ్ ఘోష్, మీసాల లక్ష్మణ్, నితిన్ ప్రసన్న వంటి తదితరులు నటించినప్పటికీ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవటం గమనార్హం. ఇలా వరుస ఫ్లాప్ సినిమాల ద్వారా సతమతం అవుతున్న రాజ్ తరుణ్ ఇకపై కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకొని సినిమాలు చేయకపోతే ఈయన కెరియర్ కు ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.
Also Read: Bahubali The Epic OTT: ఓటీటీలోకి బాహుబలి ది ఎపిక్.. ఎప్పుడు?ఎక్కడంటే?