E-Paper
Advertisement

Raghava Lawrence : డౌన్ సిండ్రోమ్ పీపుల్ కు రాఘవ లారెన్స్ సేవ, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

Raghava Lawrence : డౌన్ సిండ్రోమ్ పీపుల్ కు రాఘవ లారెన్స్ సేవ, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు
Advertisement

Raghava Lawrence : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు అద్భుతమైన పాటలను కొరియోగ్రఫీ చేశారు రాఘవా లారెన్స్. కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా దర్శకుడుగా కూడా సినిమాలు చేసి మంచి సక్సెస్ అయ్యాడు. నాగార్జున హీరోగా చేసిన మాస్, డాన్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి.

ప్రభాస్ హీరోగా కూడా రెబల్ అనే సినిమా చేశాడు రాఘవ లారెన్స్. కానీ ఆ సినిమా ఊహించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటించిన కాంచన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికీ కూడా ఈ సినిమాకి సీక్వెల్స్ వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం కాంచన 4 షూటింగ్ దశలో ఉంది.

రాఘవ లారెన్స్ సేవ 

Advertisement

తన జీవితంలో రాఘవ లారెన్స్ ఇప్పటివరకు ఎన్నో సేవలు చేశారు. అయితే మరోసారి తన సేవ హృదయాన్ని చాటుకున్నారు రాఘవ లారెన్స్. మామూలుగా చాలామంది అన్నదానాలు చేస్తూ ఉంటారు. కానీ రాఘవ లారెన్స్ చేసిన కన్మణి అన్నదాన విరుండు. ఇంకొంచెం ప్రత్యేకమైనది. దీని గురించి రాఘవ లారెన్స్ ట్విట్టర్ వేదికగా చెప్పారు.

సాధారణంగా ధనవంతులు మాత్రమే ఆస్వాదించే ఆహార రకాలను అలాంటి ఆహార రకాలను ఎప్పుడూ చూడని వారికి అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో ఈ చొరవ ప్రారంభమైంది. ఆహారం ఒక ప్రత్యేకతగా ఉండకూడదు, అది ప్రతి హృదయంలో చిరునవ్వులు తెప్పించే విధంగా ఉండాలి. ఈసారి డౌన్ సిండ్రోమ్ ఉన్న నా సోదరులకు సేవ చేయడం చాలా ప్రత్యేకమైనది.

Advertisement

వారు వివిధ రకాల ఆహారాన్ని ఆస్వాదించినప్పుడు వారి ఆనందాన్ని చూసి నా హృదయం కృతజ్ఞత మరియు ప్రేమతో నిండిపోయింది. మీ అందరి ఆశీర్వాదాలు మరియు మద్దతుతో, నేను ఇతరులకు సేవ చేస్తూనే ఉంటాను.

కన్నీళ్లు ఆగవు 

మామూలుగా చాలామంది ఫార్మాలిటీ కు అన్నదానాలు పెడుతుంటారు. కానీ రాఘవ లారెన్స్ మాత్రం ఈ వీడియోలో చూస్తుంటే స్వచ్ఛమైన హృదయంతో అందరినీ పలకరిస్తూ, అందరితో నవ్వుతూ మాట్లాడుతూ, కొంతమందికి తానే స్వయంగా తినిపిస్తూ ఆ వీడియో చూస్తున్న వాళ్లకి కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేశాడు. సినిమాల్లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అని మరోసారి రుజువు చేసుకున్నాడు.

Also Read: Bigg Boss 9: సంజన బయటికి వెళ్లిపోయిందా? గుక్క పెట్టిన ఇమ్మానియేల్, బిగ్ బాస్ మెంటల్ మాస్ ప్లాన్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×