E-Paper
Advertisement

Raashi Khanna: ఆ సీన్ సమయంలో గొడవ.. మధ్యలో వెళ్లిపోదామనుకున్నాను.. రాశి ఖన్నా కీలక వ్యాఖ్యలు

Raashi Khanna: ఆ సీన్ సమయంలో గొడవ.. మధ్యలో వెళ్లిపోదామనుకున్నాను.. రాశి ఖన్నా కీలక వ్యాఖ్యలు
Advertisement

Raashi Khanna:టాలీవుడ్ నటి రాశి ఖన్నా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమె తన గత సినిమా తెలుసు కదా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

రాశి ఖన్నా మాట్లాడుతూ..తెలుసు కదా సినిమా షూటింగ్ సమయంలోనే ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తనకు అర్థమైందని ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. కథలో కొన్ని అంశాలు తనకు సరిగా అనిపించలేదని, కానీ అప్పట్లో ఎక్కువగా మాట్లాడలేకపోయానని చెప్పింది. ఇక ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.

Advertisement

తాజాగా మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమా క్లైమాక్స్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది. ఆ సీన్ సమయంలో హీరోతో చిన్న గొడవ జరిగిందని ఆమె తెలిపింది. ప్రీ-క్లైమాక్స్‌లో హీరో తన అసలు ఉద్దేశాన్ని బయటపెడే సన్నివేశం ఉందని, ఆ సమయంలో అందరూ హీరో చెప్పేది సరైనదే అని భావించారని చెప్పింది.

కానీ రాశి ఖన్నా మాత్రం తన పాత్రకు న్యాయం కావాలని భావించింది. బిడ్డ పుట్టిన తర్వాత తన పాత్ర ఎలా స్పందించాలి అనే విషయంలో ఆమెకు వేరే ఆలోచన ఉందని చెప్పింది. “ఆ సమయంలో నా క్యారెక్టర్..బిడ్డను తీసుకుని వెళ్లిపోతే బాగుంటుందని అనిపించింది. అలా చేస్తే కథకు మరింత బలం వచ్చేదని నేను అనుకున్నాను,” అని ఆమె వివరించింది.

Advertisement

అయితే దర్శకుడు, టీమ్ మాత్రం వేరే విధంగా ఆ సీన్‌ను తీశారని ఆమె చెప్పింది. ఆ సమయంలో తన అభిప్రాయం చెప్పినా, చివరికి మార్పులు జరగలేదని తెలిపింది. దీంతో ఆ సీన్ తనకు అంతగా నచ్చలేదని కూడా చెప్పింది.

“ఆ సమయంలో నాకు చాలా అసంతృప్తిగా అనిపించింది. మధ్యలో షూటింగ్ వదిలి వెళ్లిపోదామని కూడా అనిపించింది. కానీ పరిస్థితుల వల్ల అలాగే కొనసాగించాల్సి వచ్చింది,” అని రాశి ఖన్నా వెల్లడించింది.

అయితే చివరికి ప్రొఫెషనల్‌గా తన పని పూర్తి చేసి సినిమా షూటింగ్‌ను ముగించిందని ఆమె చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో చర్చకు దారి తీస్తున్నాయి.

ALSO READ: Sandeep Kishan: హిట్ కోసం కొత్త రూట్.. శంబాల టీమ్‌తో సందీప్ కిషన్ ప్రయోగం

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×