E-Paper
Advertisement

Pushpa 2: మళ్లీ థియేటర్లలోకి పుష్ప 2… ఒక్క షోనే అస్సలు మిస్సవద్దు!

Pushpa 2: మళ్లీ థియేటర్లలోకి పుష్ప 2… ఒక్క షోనే అస్సలు మిస్సవద్దు!
Advertisement

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2(Pushpa 2). ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ విడుదల ఎలాంటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇలా అల్లు అర్జున్ కెరీయర్లో మాత్రమే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ అట్లీ (Atlee) దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

విమల్ 70mm లో స్పెషల్ షో..

ఇక పుష్ప 2 సినిమా విడుదల అయ్యి ఏడాది అవుతున్న నేపథ్యంలో నిర్మాతలు మరోసారి ఈ సినిమాని వెండితెరపైకి తీసుకురాబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 4వ తేదీకి ఈ సినిమా విడుదల అయ్యి ఏడాది పూర్తి అవుతుంది. ఇలా ఏడాదిని పురస్కరించుకొని స్పెషల్ షో ప్రదర్శించబోతున్నారని సమాచారం. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5:30 నిమిషాలకు విమల్ 70 mm (Vimal 70mm)థియేటర్లో స్పెషల్ షో వేయబోతున్నారు. ఇక ఈ స్పెషల్ షో కి కేవలం ఆఫ్ లైన్ మాత్రమే టికెట్లు అందుబాటులోకి ఉంటాయని ఆదివారం ఈ సినిమా స్పెషల్ షో కి సంబంధించిన టికెట్లను డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

పుష్ప 2 విడుదల అల్లు అర్జున్ పై కేసు..

Advertisement

ఇలా మరోసారి పుష్ప 2 సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కానున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి స్పెషల్ షోకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో తెలియాల్సి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈయన సంధ్య థియేటర్ కి వెళ్లడంతో తొక్కిసలాట ఘటన కారణంగా ఓ అభిమాని మరణించడంతో ఈ విషయంపై అల్లు అర్జున్ ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ వివాదానికి పూర్తిగా పులిస్టాప్ పడిందనే చెప్పాలి.

మూడు విభిన్న పాత్రలలో అల్లు అర్జున్..

Advertisement

అల్లు అర్జున్ ప్రస్తుత సినిమా విషయానికి వస్తే.. అట్లీ డైరెక్షన్లో మరో పాన్ ఇండియా సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ 3 విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా సుమారు 50% వరకు షూటింగ్ పనులు పూర్తి అయినట్టు సమాచారం. త్వరలోనే ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా పూర్తి అయిన అనంతరం అల్లు అర్జున్ పుష్ప3 పనులలో బిజీ కానున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×