// // Tollywood - నిర్మాతలతో ఫెడరేషన్‌ భేటీ.. మళ్లీ విఫలమైన చర్చలు.. సమ్మె కొనసాగింపు తప్పదా? -->
E-Paper
Advertisement

Tollywood: నిర్మాతలతో ఫెడరేషన్‌ భేటీ.. మళ్లీ విఫలమైన చర్చలు.. సమ్మె కొనసాగింపు తప్పదా?

Tollywood: నిర్మాతలతో ఫెడరేషన్‌ భేటీ.. మళ్లీ విఫలమైన చర్చలు.. సమ్మె కొనసాగింపు తప్పదా?
Advertisement

Tollywood Cine Workers Strike: నేటితో సినీ కార్మికుల సమ్మె ఓ కొలిక్కి వస్తుందని అంతా అనుకున్నారు. ఫెడరేషన్‌ సభ్యులు, ఇతర సినిమా సంఘాలు నాయకులు బుధవారం(ఆగష్టు 13) మరోసారి నిర్మాతలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఫేడరేషన్‌ సభ్యులు, నిర్మాతలు, ఫిల్మ్‌ ఛాంబర్‌ సభ్యులతో పాటు తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మ్మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు పాల్గొన్నారు.

Advertisement

వాడి వేడిగా కొనసాగుతున్న చర్చలు

అయితే ఈ సమావేశం కూడా విఫలమైనట్టు తెలుస్తోంది. నిర్మాతలు ప్రతిపాదించిన వర్కింగ్ కండిషన్స్ కి ఒక్క దానికి కూడా ఫెడరేషన్‌ సభ్యులు, నేతలు అంగీకరించడం లేదు. దీంతో ఛాంబర్‌లో ఇరు వర్గాల మధ్య చర్చలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. దాదాపు రెండున్నర గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగుతూనే ఉంది. కానీ, ఇప్పటికీ సమ్మెపై కొలిక్కి వచ్చే అంశం ఒకటి కూడా రాలేదు. దీంతో ఈ సమావేశం కూడా విఫలమైన సమ్మె కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా ఫెడరేషన్‌ సభ్యుల కోరిక పమేరకు నిర్మాతల మరోసారి చర్చలకు సిద్దమైన సంగతి తెలిసిందే. వారి పిలుపు మేరకు ఇవాళ ఫిల్మ్‌ ఛాంబర్‌లో భేటీ నిర్వహిస్తు ఇటీవల ప్రకటన ఇచ్చారు.

Advertisement

మరోసారి కూడా నిరాశే

ఇరువురు కూడా సమ్మె సమస్య పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిపి.. ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకువస్తారని అంతా అభిప్రాయపడ్డారు. కానీ, ఫెడరేషన్‌ మొండివైఖరి చూపిస్తూ.. నిర్మాతల ప్రతిపాదనలకు తొసిపుచ్చుతున్నారు. దీంతో నిర్మాతల ఫెడరేషన్‌ డిమాండ్స్‌ తీర్చలేమని, సమ్మె కొనసాగింపు తాము సిద్ధమే అని స్టేట్‌మేంట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో సినీ కార్మికులు సమ్మె కొనసాగేలా కనిపిస్తోంది. మరి ఈ వివాదం ఎప్పుడు సద్దుమనుగుతుంది, సమ్మెకు ఎండ్‌ కార్డు పడేది ఎప్పుడో స్పష్టత రావడం లేదు. కాగా 30 శాతం వేతనాలు పెంపుకోసం ఫెడరేషన్ సభ్యులు, యూనియన్‌ నాయకులు నిర్మాతలను డిమాండ్‌ చేశారు. దీనికి ప్రొడ్యూసర్స్‌ ఒప్పకోకపోడవడంతో ఫెడరేషన్‌ సమ్మెకు పిలుపునిచ్చింది.

Also Read: Actress Sadha: సుప్రీం తీర్పు.. ప్లీజ్ అలా చేయొద్దంటూ బోరుమని ఏడ్చేసిన హీరోయిన్ సదా

ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రకటన లేకుండానే రాత్రి రాత్రే సమ్మెకు సైరన్‌ మోగించాయి. దీంతో మిడియం, చిన్న సినిమాల షూటింగ్స్‌ నిలిచిపోయాయి. ఫెడరేషన్‌ సభ్యుల తీరుపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కార్మికులు వేతనాలు ఎక్కువగా ఉన్నాయని పెంచడం కుదరదని వివరించారు. అంతేకాదు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ నష్టాల్లో ఉందని, ఈ టైంలో వేతనాలు పెంపు సాధ్యపడదని కూడా చెప్పాయి. అయినా ఫెడరేషన్‌ వినకుండ మొండిగా వ్యవహరిస్తూ కార్మికులతో సమ్మెకు పిలుపునిచ్చింది. మరోవైపు నిర్మాతలు కూడా తగ్గేదే లే అంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తెప్పించనుకుని షూటింగ్స్‌ జరుపుతామని తెలిపాయి. దీంతో సినీ కార్మికులు గొడవలు, దాడులకు దిగుతూ టాలీవుడ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు తీసుకువస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×