E-Paper
Advertisement

Raju Weds Rambai: స్టేజ్ పై ఏడ్చేసిన దర్శకుడు వేణు, ఎమోషనల్ అయిపోయిన సాయిలు

Raju Weds Rambai: స్టేజ్ పై ఏడ్చేసిన దర్శకుడు వేణు, ఎమోషనల్ అయిపోయిన సాయిలు
Advertisement

Raju Weds Rambai: ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని చెబుతూ ఉంటారు. మనుషులు పోలిన మనుషులతో పాటు మనుషులు వ్యక్తిత్వాలను పోలిన మనుషులు కూడా ఉండటం సహజంగా జరుగుతుంది. కొంతమందిని చూసినప్పుడు అచ్చం నాలానే ఆలోచిస్తున్నాడు. ఇతని వ్యక్తిత్వం నాలానే అనిపిస్తుంది అని ఒక ఆలోచన కలుగుతుంది. అచ్చం దర్శకుడు వేణు ఉడుగుల కు అదే జరిగింది.

నీది నాది ఒకే కథ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు వేణు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమా తర్వాత చేసిన విరాటపర్వం సినిమా కేవలం ప్రశంసలకు మాత్రమే పరిమితం అయిపోయింది. సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. అయితే దర్శకుడు వేణుకు ఎప్పటికైనా సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అని ఆలోచన ఉండేది. కానీ దానికి టైం పడుతుంది అని అనుకున్నారు. అటువంటి తరుణంలో దర్శకుడు సాయిలు కంపాటి రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా కథను వేణు దగ్గరకు తీసుకొచ్చాడు.

కన్నీళ్లు పెట్టుకున్న వేణు

Advertisement

రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలోని నటీనటులు పెద్దగా తెలియకపోయినా కూడా కేవలం పాట పాపులర్ అవడంతో, అలానే ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకోవడంతో ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాకు ఓపెనింగ్స్ రావడం మాత్రమే కాకుండా మంచి టాక్ రావడంతో సక్సెస్ అయింది.

సక్సెస్ ఈవెంట్లో వేణు మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సాయిలు నాకు సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి వలన పరిచయం. ఖమ్మంలో బయలుదేరినప్పుడు సర్ ఆఫీస్ కి రావొచ్చని ఫోన్ చేశాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత సార్ ఆఫీస్ కు రావచ్చా అని ఫోన్ చేశాడు. సర్ ఫిలింనగర్ వచ్చాను ఆఫీస్ కు రావచ్చా అని కాల్ చేశాడు. సర్ రిసెప్షన్ లో ఉన్నాను లోపలికి రావచ్చా అన్నాడు. ఇవన్నీ చెప్పిన తరువాత కొంత గ్యాప్ తీసుకొని వేణు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Advertisement

ఇతను స్వచ్ఛమైన మట్టి మనిషి అలా అడుగుతుంటే నా గుండె తరుక్కుమన్నది. ఒకరోజు షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఎక్కువ రేటు బట్టలు చూసి కూడా షాక్ అయిపోయాడు. ఇతనిలో నన్ను నేను చూసుకున్నాను అని వేణు చెప్పారు.

వెట్రీ మారన్ అవుతాడు 

ఈరోజు నేను చెబుతున్నాను బాగా గుర్తుపెట్టుకోండి కొన్ని సంవత్సరాలు పోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వెట్రి మారన్, పా రంజిత్ ఆ స్థాయిలో సాయిలు కంపాటి ఉంటాడు అని నిర్మాత వేణు చెప్పారు.

Also Read: Raju Weds Rambai: నువ్వు బట్టలిప్పుతాను అనగానే నాకు వణుకు పుట్టింది, బాబీ షాకింగ్ కామెంట్స్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×