// // SKN Tweet- ఆంధ్ర కింగ్‌ తాలుకా మూవీపై SKN రివ్యూ.. -->
E-Paper
Advertisement

SKN Tweet: ఆంధ్ర కింగ్‌ తాలుకా మూవీపై SKN రివ్యూ.. ఏమన్నారంటే!

SKN Tweet: ఆంధ్ర కింగ్‌ తాలుకా మూవీపై SKN రివ్యూ.. ఏమన్నారంటే!
Advertisement

SKN Review on Andhra King Taluka: రామ్‌ పోతినేని, భాగ్యశ్రీ భోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ఆంధ్ర కింగ్‌ తాలుకా‘. బయోపిక్‌ ఆఫ్‌ ఫ్యాన్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. గురువారం (నవంబర్‌ 27) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్‌ బాబు దర్శకత్వంలో అభిమాని బ్యాక్‌ ట్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ముందు నుంచి సినిమాకు పెద్దగా బజ్‌ కనిపించలేదు. ఇక థియేటర్లలోనూ అదే ఫలితం కనిపిస్తోంది. 

ప్రతి అభిమాని బయోపిక్‌ ఇది

Advertisement

అయితే ఈ సినిమాపై తాజాగా బేబీ మూవీ నిర్మాత ఎస్కేన్‌ తన రివ్యూ ఇచ్చాడు. ఈ సినిమా చూసిన ఆయన సినిమాపై తన రివ్యూ ఇస్తూ ఎమోషనల్‌ అయ్యాడు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఇకపోతే ఎస్ కే ఎన్ కొన్ని సందర్భాలలో సినిమా వేడుకల్లో మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. తన మాటల్లోనే సినిమా మీద ఎంత ప్రేమ ఉందో చాలామందికి అర్థమవుతుంది. మామూలుగా సక్సెస్ ఈవెంట్స్ లో కనిపించే ఎస్ కే ఎన్ ఈరోజు ట్విట్టర్లోనే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మీద విపరీతమైన ప్రశంసలు కురిపించారు.

ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను బాగా ఎమోషనల్ అయిపోయాను. ఇది ప్రతి అభిమాని యొక్క బయోపిక్. చాలామంది అభిమానులకు ఈ సినిమా అన్ని విధాలుగా కనెక్ట్‌ అవుతుంది. అలాగే ప్రతి అభిమాని కళ్ల వెళ్ల ఆనంద భాష్పాలను తీసుకువచ్చేలా ఉంది. తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించిన ఉపేంద్ర, రామ్‌ పోతినేనిలకు శిరస్సు వంచి అభివందనం చేస్తున్నాను. దర్శకుడు మహేష్ బాబు అద్భుతమైన వర్క్ చేశాడు. కథను నమ్మి సినిమా చేసేందుకు ముందుకు వచ్చిన మైత్రీ మూవీ మేకర్స్‌కి క్రతజ్ఞతలు తెలుపుతున్నా” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఎస్కేన్‌ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Advertisement

వరుస ప్లాప్స్ కెరీర్ స్లో

కాగా డబుల్‌ ఇస్మార్ట్‌, స్కంద వంటి చిత్రాల తర్వాత రామ్‌ పోతినేని నటించిన చిత్రమిది. నిజానికి రామ్‌కి మంచి హిట్‌ పడి చాలా కాలం అవుతుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ ప్లాప్స్ రామ్‌ కెరీర్‌ స్లో అయ్యింది. ఒకప్పుడు లవ్‌స్టోరీస్‌ చేస్తూ లవర్‌ బాయ్‌ పేరు తెచ్చుకున్న రామ్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ నుంచి మాస్‌ యాక్షన్‌ని నమ్ముకున్నాడు. కానీ, అవి పెద్దగా వర్కౌట్‌ కావడం లేదు. ఇక ఈ సారి అభిమాని సినిమా అంటూ ఆంధ్ర కింగ్‌ తాలుకాతో వచ్చాడు. ఆడియన్స్‌, అప్‌కమ్మింగ్‌ డైరెక్టర్స్‌ ఆకట్టుకునేలా ఉన్న ఈ సినిమా సినీ ఇండస్ట్రీ మాత్రమే మెప్పించేలా ఉందంటున్నారు. సగటు, సాధారణ ఆడియన్స్‌ ఈ కథ కనెక్ట్‌ అయ్యేలా లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వరుస ప్లాప్స్‌ తర్వాత వచ్చిన రామ్‌ పోతినేని.. ఈ సినిమా కూడా నిలబెట్టాలే కనిపించడం లేదు.

Also Read: Singer Mangli: సింగర్ మంగ్లీపై అసభ్యకర కామెంట్స్‌.. ‘మేడిపల్లి స్టార్’ అరెస్ట్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×