E-Paper
Advertisement

Mowgli Movie First Review : మౌగ్లీ మూవీ ఫస్ట్ రివ్యూ చెప్పిన నిర్మాత.. హైలైట్స్ ఏంటంటే?

Mowgli Movie First Review : మౌగ్లీ మూవీ ఫస్ట్ రివ్యూ చెప్పిన నిర్మాత.. హైలైట్స్ ఏంటంటే?
Advertisement

Mowgli Movie First Review: కలర్ ఫోటో ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ (Sandeep Raj)దర్శకత్వంలో రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మోగ్లీ(Mowgli). ఈ సినిమా నేడు ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. డిసెంబర్ 13వ తేదీ నుంచి థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితం కాబోతోంది. ఈ క్రమంలోనే సినీ నిర్మాతల కోసం ప్రత్యేక ప్రీమియర్లను వేయడంతో పలువురు దర్శక నిర్మాతలు సినీ సెలబ్రిటీలు ఈ సినిమాను వీక్షించారు ఈ క్రమంలోనే నిర్మాత ఎస్కేఎన్(SKN) మోగ్లీ సినిమా చూసిన అనంతరం ఈ సినిమా పట్ల తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ఇండస్ట్రీకి మరో టాలెంటెడ్ హీరో ..

ఈ సందర్భంగా నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. మోగ్లీ సినిమా చూసిన తర్వాత ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా చూసాం అనే భావన నాలో కలిగిందని తెలిపారు. ఇండస్ట్రీకి మంచి పొటెన్షియాలిటీ ఉన్న సూపర్ హీరో దొరకారు అంటూ రోషన్ పై ప్రశంసలు కురిపించారు. బెస్ట్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమా ఈ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ క్లైమాక్స్ నా మైండ్ నుంచి వెళ్లిపోలేదని తెలిపారు. ఈ సినిమా ప్రారంభమైన పది నిమిషాల నుంచి నాకు సినిమా చూసిన భావన కనపడలేదు, ఏదో ఒక ప్రపంచంలోకి వెళ్లిపోయినట్టుంది. ఇక హీరోయిన్ సాక్షి నటన అద్భుతమని తెలిపారు. ఈ సినిమాలో ఆమె నటన చూస్తుంటే నిజంగానే మాటలు రావేమోనన్న అంత అద్భుతంగా నటించారని ప్రశంసల కురిపించారు.

సందీప్ రాజ్ పేరు పడగానే గూస్ బంప్స్..

Advertisement

ఇక ఈ సినిమా కథ రాసిన సందీప్ రాజా పేరును స్క్రీన్ పై చూడగానే నాకు గూస్ బంప్స్ వచ్చాయని తెలిపారు. ఇక కాలభైరవ మ్యూజిక్ గురించి మాట్లాడుతూ ఒక పెద్ద సినిమాకు బిజిఎం ఇస్తే ఎలా గుండె ఆదురుతుందో అంత అద్భుతంగా ఈ సినిమాకు బిజిఎం ఇచ్చారని కాలభైరవ పై కూడా ప్రశంసలు కురిపించారు. ఇక వైవాహర్ష నటన కూడా అద్భుతంగా ఉందని తెలిపారు. అయితే వీళ్ళందరికీ ఫుల్ సపోర్ట్ ఇచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి అభినందనలు అంటూ ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందని ఈ వారం ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకులందరూ చూడబోతున్నారని ఎస్కేయన్ తెలిపారు.

Advertisement

ఈ సినిమా ద్వారా సందీప్ రాజ్ మరొక నేషనల్ అవార్డ్ అందుకుంటారు. అంత అద్భుతంగా సన్నివేశాలు ఉన్నాయని సెకండ్ హాఫ్ లో మూడు నాలుగు సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని ఈయన మోగ్లీ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ ఈ సినిమాకు మరింత ప్రాధాన్యతను కల్పించాయని చెప్పాలి. మరి నేడు సాయంత్రం నుంచి ప్రీమియర్లు ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తే మాత్రం రోషన్ కచ్చితంగా సక్సెస్ కొడతారనే చెప్పాలి. మరి ఈ సినిమాతో ఇటు రోషన్ అటు సందీప్ రాజ్ ఇలాంటి హిట్ కొడతారో వేచి చూడాలి.

Also Read: Akhanda 2: అఖండ 2 పై దువ్వాడ శ్రీనివాస్ , మాధురి రివ్యూ.. జై బాలయ్య అంటూ!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×