E-Paper
Advertisement

SKN On Bandla : పేరు తీయకుండానే రెచ్చిపోయిన ఎస్కేఎన్, బండ్ల రియాక్షన్ ఏంటో?

SKN On Bandla : పేరు తీయకుండానే రెచ్చిపోయిన ఎస్కేఎన్, బండ్ల రియాక్షన్ ఏంటో?
Advertisement

SKN On Bandla : జర్నలిస్టుగా తన కెరియర్ మొదలుపెట్టిన ఎస్ కే ఎన్ తర్వాత కాలంలో నిర్మాతగా మారిపోయారు. నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలు తీశారు. అయితే ఇప్పటివరకు ఎస్కేయం నిర్మాతగా చేసిన ప్రతి సినిమాకి కూడా కేవలం తెలుగు హీరోయిన్స్ మాత్రమే పరిచయం చేశాడు. అయితే ఇప్పటివరకు ఒక డిజాస్టర్ సినిమా కూడా ఎస్కేఎన్ కెరియర్ లో పడలేదు.

నిర్మాత గానే కాకుండా కొన్ని సందర్భాలలో ఎస్కే ఎన్ మాట్లాడే మాటలు వైరల్ గా మారుతుంటాయి. ఎస్కే ఎన్ స్పీచ్ కోసం ఎదురుచూసే ఆడియన్స్ కూడా ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి. ఒకసారి మైక్ పట్టుకుని స్టేజ్ ఎక్కాడు అంటే ఇంకా ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉంటాడు.

బండ్లకు కౌంటర్ 

Advertisement

గతంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ అల్లు అరవింద్ చివర్లో వచ్చి క్రెడిట్ తీసుకుంటారు అని అన్నారు. ఆ మాటలు కూడా చాలా క్యాజువల్ గానే నవ్వుతూ మాట్లాడారు గణేష్. అది స్వదుద్దేశంతోనే చెప్పారు. ఆ మాటలకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు ఎస్కేఎన్.

ఇండియాలో ఏ ప్రొడ్యూసర్ కూడా ఇన్ని రోజులు ఆక్టివ్ గా ఉండి, హిట్ సినిమాలు చేస్తూ, తాను హిట్ సినిమాలు చేయడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళను ప్రొడ్యూసర్లు చేసి, వాళ్లు హిట్లు కొడుతుంటే, చివర్లో వచ్చి క్రెడిట్ తీసుకోరు వాళ్ళ క్రెడిట్ ను ఎంజాయ్ చేస్తారు అని మొదటిగా ఉంటే వేశాడు.

Advertisement

అలానే కిరణ్ అబ్బవరం నటించిన కే రాంప్ సినిమా ఈవెంట్ కు బండ్ల గణేష్ హాజరై, వాట్సప్ వాట్సప్ అంటే హిట్ సినిమాలు రావు. కష్టపడితే హిట్ సినిమాలు వస్తాయి. అంటూ ఇన్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండను మాట్లాడిన సంగతి తెలిసిందే. దానిపై ఈవెంట్ లో మాట్లాడినందుకు కొందరు బాధపడుతున్నారని తెలిసింది. అందుకు క్షమాపణలు కూడా చెప్పాడు బండ్ల.

దీనికి మళ్లీ సమాధానంగా ఎస్ కే అని మాట్లాడుతూ.. కొంతమంది విజయ్ దేవరకొండను కామెంట్ చేస్తున్నారు. బోన్ లో ఉన్నా కూడా సింహమే అంటూ డైలాగులు చెప్పారు. ఒక్కసారి పోస్టర్ విడుదలైన తర్వాత ది విజయ్ దేవరకొండ అని పడితే అప్పుడు తెలుస్తుంది అసలైన మేటర్. ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, రెండోసారి కొడితే లక్ అంటారు, మూడోసారి కొడితే దాన్ని ఇండస్ట్రీ షేక్ అంటారు. విజయ్ దేవరకొండ లైనప్ నాకు తెలుసు అంటూ మరో కౌంటర్ వేశారు.

Also Read: Bigg Boss 9 : నన్ను తొక్కి నువ్వు లేవకు, దివ్య పై రెచ్చిపోయిన రీతు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×