E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: ఖుషీలానే ఉస్తాద్.. మాట ఇచ్చే ముందు కొంచెం ఆలోచించాలి సార్

Ustaad Bhagat Singh: ఖుషీలానే ఉస్తాద్.. మాట ఇచ్చే ముందు కొంచెం ఆలోచించాలి సార్
Advertisement

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఒప్పుకున్న మూడు సినిమాల్లో రెండు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ కి సిద్దమయ్యాయి. ఇక అందులో మూడో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉస్తాద్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం హరీష్ – పవన్ కాంబోలో ఇప్పటికే గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ వచ్చింది. చాలాకాలం తరువాత వీరిద్దరి కాంబో మళ్లీ రిపీట్ అవుతుంది. అందుకే ఉస్తాద్ పై అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇక ఇప్పటికే షూటింగ్ మొత్తం ఫినిష్ అవ్వగా ఉస్తాద్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. మొదటి నుంచి ఈ సినిమా.. తమిళ్ లో స్టార్ హీరో విజయ్ – అట్లీ కాంబోలో వచ్చిన తేరి సినిమాకు రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను హరీష్ కొట్టిపడేశాడు. కానీ, టీజర్, పోస్టర్స్ అన్నీ తేరినే గుర్తుచేస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ పోలీస్ గా.. ఒక పాపకు తండ్రిగా కనిపిస్తాడు. ఇక ఉస్తాద్ లో పవన్ కు ఇద్దరు హీరోయిన్లను అయితే పెట్టారు కానీ, పాపను పెట్టారో లేదో తెలియదు. కేవలం తేరి స్టోరీ లైన్ ని మాత్రమే తీసుకొని.. మిగతా కథ అంతా తెలుగు నేటివిటీకి తగట్లే తెరకెక్కించినట్లు సమాచారం.

Advertisement

ఇక తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి.. ఉస్తాద్ గురించి అభిమానులకు ఒక మాట ఇచ్చాడు. ఉస్తాద్.. తేరి రీమేక్ కాదని తేల్చి చెప్పాడు. హరీష్.. రీమేక్ అనే మొదలుపెట్టాడు. కానీ, ఆ తరువాత తన స్టైల్ లో తెరకెక్కించాడు. ఉస్తాద్ లోని సీన్స్, కొన్ని సాంగ్స్ అందరికీ ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి. ఖుషీకి మీరెంత వైబ్ అయ్యారో అలాగే ఉస్తాద్ కి కూడా అవుతారు’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్.. రిలీజ్ కు ముందు అందరూ ఇలాగే చెప్తారు. మాట ఇచ్చే ముందు ఆలోచించుకోండి. తరువాత ఏదైనా తేడా జరిగితే ట్రోల్స్ అని తట్టుకోలేరు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×