E-Paper
Advertisement

OG Film: ఓజి నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్న యంగ్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్

OG Film: ఓజి నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్న యంగ్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్
Advertisement

OG Film: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో రాహుల్ యాదవ్ నక్క (Rahul Yadav Nakka) ఒకరు. మళ్లీ రావా (Malli Rava) సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చారు రాహుల్. ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ (agent Sai Srinivasa athreya), మసుద (Masooda), ఇక రీసెంట్ గా బ్రహ్మానందం (Brahmanandam) వంటి సినిమాలను నిర్మించాడు.

ఇప్పటివరకు రాహుల్ యాదవ్ నిర్మించిన నాలుగు సినిమాలు కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. మంచి సినిమాలు మాత్రమే తీస్తాడు అని ఈయనకు మంచి పేరు ఉంది. అలానే ఈయన గతంలో నేను తెలుగు సినిమా పరిశ్రమకు అయిదుగురు కొత్త దర్శకులను పరిచయం చేస్తాను అంటూ చెప్పాడు. ఇప్పటికే నలుగురు కొత్త దర్శకులను పరిచయం చేసేసాడు.

ఓజి నిర్మాతలకు రిక్వెస్ట్ 

Advertisement

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ఓజి (OG) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. మంచి సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా కొత్త రికార్డ్స్ ని కూడా క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తుంది. అయితే ఈ సినిమా టిక్కెట్ కాస్ట్ విషయంలో చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి. ఎవరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు.

వాస్తవానికి సినిమాకి మంచి రిపీట్ వాల్యూ ఉంది. సినిమా టిక్కెట్ రేటు ఎక్కువగా ఉండటం వలన ఇంకొకసారి వెళ్లడానికి కూడా ప్రేక్షకులు ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. ఇదే విషయంపైన ఆ సినిమా నిర్మాతలను రాహుల్ యాదవ్ నక్క రిక్వెస్ట్ చేశారు.

Advertisement

ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు “సినిమా రిపీట్ వాల్యూ పెంచడానికి రేపటి నుండి టికెట్ ధరలను 200 కి తగ్గించడం గురించి ఆలోచించాలని #OG నిర్మాత మరియు పంపిణీదారులను నేను కోరుతున్నాను మరియు అభ్యర్థిస్తున్నాను. వెయ్యి రూపాయలు పెట్టి ఇద్దరు చూసే బదులు ఐదుగురు చూస్తారు. వాళ్లు మళ్లీ మళ్లీ చూస్తారు. ఇది ఐదుగురు కలిసి చూసే సినిమా అంటూ ట్విట్టర్ వేదిక పోస్ట్ పెట్టారు.

నెటిజన్స్ మద్దతు 

రాహుల్ యాదవ్ నక్క పోస్టుకు నెటిజన్స్ కూడా అంగీకారం తెలుపుతున్నారు. అలానే ఆయా నిర్మాతలను పోస్టులో మెన్షన్ చేయమని కామెంట్స్ పెడుతున్నారు. టికెట్ రేటు తగ్గిస్తే మళ్లీమళ్లీ చూస్తాం అంటూ కూడా ఈ సినిమాకు సపోర్ట్ వస్తుంది. ఎలానో దసరా సీజన్ దగ్గర పడుతుంది కాబట్టి టిక్కెట్ రేట్లు తగ్గితే ఈ సినిమాకి మరింత మెరుగైన కలెక్షన్స్, అలానే హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా చూడొచ్చు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Kantara Chapter 1 Event : యాంకర్ సుమా పై మరోసారి సీరియస్ అయిపోయిన ఎన్టీఆర్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×