E-Paper
Advertisement

Mythri Ravi : కంటెంట్ బాగుంటే థియేటర్లు ఇస్తారు, కిరణ్ అబ్బవరం కు మైత్రి రవి కౌంటర్?

Mythri Ravi : కంటెంట్ బాగుంటే థియేటర్లు ఇస్తారు, కిరణ్ అబ్బవరం కు మైత్రి రవి కౌంటర్?
Advertisement

Mythri Ravi : ఏదైనా తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఆదరించినంతగా పర భాష ప్రేక్షకులు సినిమాలను ఆదరించరు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూస్తారు. కొన్ని సందర్భాలలో తెలుగు సినిమాల కంటే మిగతా లాంగ్వేజ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఓపెన్ సీక్రెట్.

అందుకే కిరణ్ అబ్బవరం నటించిన K -Ramp సినిమా టీజర్ లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు పలు రకాల కామెంట్లు కూడా వచ్చాయి. అయితే ఇతర భాష సినిమాలను తెలుగులో ఆదరించినంతగా మన తెలుగు సినిమాలను ఇతర భాషల్లో ఆదరించరు అనేది ఒకటి ఉంది. దానిని పరిగణలోకి తీసుకొని ఒక జర్నలిస్ట్ ఇదే ప్రశ్నను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి ను అడిగారు.

మైత్రి రవి ఆన్సర్

Advertisement

అలా ఏమీ ఉండదండి దివాళి అనేది తమిళనాడులో బిగ్గెస్ట్ ఫెస్టివల్. మనతో పోలిస్తే తమిళనాడులో థియేటర్లు నెంబర్ చాలా తక్కువ. మహా అయితే అక్కడ ఒక 600 ఉన్నాయి అనుకుంటున్నాను. అది కరెక్ట్ కూడా నాకు తెలియదు మహా అయితే 800 థియేటర్స్ ఉన్నాయి. మనకు మాత్రం 1800 థియేటర్లు ఉన్నాయి. అక్కడ కొన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఎక్స్ ధియేటర్లో కొన్ని సినిమాలు, వై థియేటర్లో కొన్ని సినిమాలు అంటూ డివైడ్ అవుతుంటాయి.

ఫస్ట్ డే సినిమాకు వచ్చే టాకును బట్టి అక్కడ సినిమా ధియేటర్లు అడ్జస్ట్ అయిపోతుంటాయి. బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి. నువ్వు మంచి కంటెంట్ ఇస్తే ఆటోమెటిగ్గా థియేటర్స్ నీకు వచ్చేస్తాయి. అంతేకానీ ఊరికే థియేటర్స్ రావట్లేదు అని అనడం కరెక్ట్ కాదు. మనం ఆ విధంగా ఎవరిని బ్లేమ్ చేయకూడదు చేయకూడదు. పొంగల్ టైంలో మనకు కూడా ఒక రూల్ ఉంది అదంతా వేరే టాపిక్ అంటూ మైత్రి రవి ఆన్సర్ ఇచ్చారు.

కిరణ్ కు కౌంటర్.?

Advertisement

వాస్తవానికి రీసెంట్ గా కిరణ్ అబ్బవరం తన సినిమాకు సంబంధించి ఒక ప్రముఖ తమిళ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ప్రదీప్ రంగనాథన్ కు హైదరాబాదులో మంచి ఆదరణ చూపిస్తాము థియేటర్స్ కూడా ఆయనకు ఎక్కువ ఇస్తారు. కానీ నా క సినిమాకు ఇక్కడ థియేటర్స్ ఇవ్వమని డైరెక్ట్ గా చెప్పేశారు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు మైత్రి రవి కంటెంట్ బాగుంటే అని చెప్పడం కిరణ్ కి కౌంటర్ లా అనిపిస్తుంది. మరోవైపు ప్రదీప్ రంగనాథన్ మైత్రిలోనే సినిమా చేసిన విషయం తెలిసిందే.

Also Read : Pradeep Ranganathan : మీరు హీరోలా ఉండరు, లేడీ రిపోర్టర్ ని ఉతికి పారేసిన ప్రదీప్ రంగనాథన్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×