E-Paper
Advertisement

GlobeTrotter Event : 15 సంవత్సరాల క్రితం ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలెక్కింది, నిర్మాత ఎమోషనల్

GlobeTrotter Event : 15 సంవత్సరాల క్రితం ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలెక్కింది, నిర్మాత ఎమోషనల్
Advertisement

GlobeTrotter Event : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలలో కే ఎల్ నారాయణ ఒకరు. హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో, రాఖీ వంటి ఎన్నో సినిమాలను ఆయన నిర్మించారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేయాలని అప్పట్లోనే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా అప్పుడు పట్టాలెక్కలేదు దాదాపు 15 సంవత్సరాల క్రితం అనుకున్న ప్రాజెక్టు ఇప్పుడు పట్టలెక్కింది.

మహేష్ బాబు ప్రొడ్యూసర్స్ హీరో 

మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఈవెంట్ సక్సెస్ చేయటానికి వచ్చారు. ఈ సినిమా గురించి మీకు చెప్పాలంటే. ఎన్నో సంవత్సరాల క్రితం. మహేష్ బాబు గారిని రాజమౌళితో సినిమా చేద్దామని చెప్పి అడిగాను. వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఇంత టైం పడుతుంది అని ఆయన నేను ఇద్దరం కూడా ఊహించలేదు. సూపర్ స్టార్ కృష్ణ గారి లాగానే మహేష్ బాబు ప్రొడ్యూసర్ హీరో. అందుకనే నాతోటి ఇన్నాళ్లు వెయిట్ చేసి, ఈరోజు ఈ సినిమా చేయటానికి ముందుకొచ్చారు.

రాజమౌళి ఏమీ మారలేదు

Advertisement

రాజమౌళి గారు ను 15 సంవత్సరాల క్రితం మహేష్ బాబుతో సినిమా చేద్దామని అడిగాను. ఆయన కూడా అప్పుడు ఒప్పుకున్నారు. కానీ నా కమిట్మెంట్స్ అయిన తర్వాత చేస్తాను అని మాట ఇచ్చారు. ఈ 15 సంవత్సరాల్లో రాజమౌళికి ఒక ఈగ మర్యాద రామన్న ఒక బాహుబలి త్రిబుల్ ఆర్ సినిమాలు వచ్చాయి. రాజమౌళి గారు డైరెక్టర్ గా ఎంత ఎత్తుకు ఎదిగిపోయారో అందరికీ తెలుసు. అయినా 15 సంవత్సరాల క్రితం రాజమౌళి పరిచయమైనప్పుడు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలానే ఉన్నారు.

అంటూ నిర్మాత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు తెలిపారు. మొత్తానికి ఈ స్థాయికి వెళ్లిపోయిన తర్వాత కూడా 15 సంవత్సరాలు తర్వాత ఈ కమిట్మెంట్ కు కట్టుబడి ఉండటం అనేది రాజమౌళి గొప్పతనానికి నిదర్శనం.

Advertisement

Also Read: GlobeTrotter Event : నందిపై మహేష్ బాబు ఎంట్రీ, ఈ విజువల్ వెనుక ఆసక్తికర విషయం ఇదే

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×