E-Paper
Advertisement

Producer Damodar Prasad: డబ్బులిస్తే హిట్.. లేదంటే ఫ్లాపా? ..డిజిటల్ మాఫియాపై నిర్మాత నిప్పులు

Producer Damodar Prasad: డబ్బులిస్తే హిట్.. లేదంటే ఫ్లాపా? ..డిజిటల్ మాఫియాపై నిర్మాత నిప్పులు
Advertisement

Producer Damodar Prasad: చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో, నిర్మాత దామోదర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘ఈషా’ సినిమా ప్రెస్ మీట్ వేదికగా ఆయన డిజిటల్ మీడియాలో సాగుతున్న పెయిడ్ నెగిటివిటీపై యుద్ధం ప్రకటించారు.

ప్రీమియర్ షోలే సమాధానం
సినిమా విడుదల కాకముందే సక్సెస్ మీట్ ఏంటి అని కొందరు ఆశ్చర్యపోవచ్చు. కానీ ‘ఈషా’ ప్రీమియర్ షోలకు వచ్చిన అద్భుతమైన స్పందనే ఈ ధైర్యానికి కారణమని దామోదర్ ప్రసాద్ తెలిపారు. సినిమా కంటెంట్‌పై మాకున్న నమ్మకం, ప్రీమియర్ షోలు ఫుల్ అవ్వడం చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఇది ఆర్గానిక్ సక్సెస్ అని ఆయన గర్వంగా చెప్పుకొచ్చారు.

Advertisement

రివ్యూల పేరుతో బ్లాక్ మెయిల్
కొందరు సీనియర్ జర్నలిస్టులు, డిజిటల్ మీడియా సంస్థలు సినిమా చూడకుండానే నెగిటివ్ ఆర్టికల్స్ రాయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని సినిమాలను ఆకాశానికి ఎత్తడం, ఇవ్వకపోతే పాతాళానికి తొక్కేయడం వంటి నీచమైన పనులు చేస్తున్నారు. గతంలో ‘కళ్యాణ వైభోగమే’ సినిమాకు సెన్సార్ కాకముందే రివ్యూలు రాశారు. ఇప్పుడు ఈషా విషయంలోనూ అదే పునరావృతం చేస్తున్నారటూ మండిపడ్డారు.

చిన్న సినిమాల గొంతు నొక్కకండి
ఒక చిన్న సినిమా హిట్ అయితే ఎంతోమంది టెక్నీషియన్ల జీవితాలు సెటిల్ అవుతాయి. అఖిల్, హెబ్బా పటేల్, అరుణ్ వంటి టాలెంటెడ్ నటులు ఈ సినిమా కోసం చెమటా ఓడ్చి పనిచేశారు. కావాలని నెగిటివ్ ప్రచారం చేసి ఆ కష్టాన్ని వృథా చేయకండని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

స్ట్రాంగ్ వార్నింగ్
నెగిటివ్ ప్రచారం చేసే వారికి దామోదర్ ప్రసాద్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. నా పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా ఈ డిజిటల్ మార్కెటింగ్ అక్రమాలు, పైరసీపై యుద్ధం చేస్తాను. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×