E-Paper
Advertisement

Hari Hara Veeramallu: ఆ పొలిటిషన్ కి అదిరిపోయే సమాధానం ఇచ్చిన నిర్మాత ఏం రత్నం

Hari Hara Veeramallu: ఆ పొలిటిషన్ కి అదిరిపోయే సమాధానం ఇచ్చిన నిర్మాత ఏం రత్నం
Advertisement

Hari Hara Veeramallu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నిర్మాతలలో ఏఎం రత్నం ఒకరు. కేవలం నిర్మాతగానే కాకుండా ఒక దర్శకుడిగా రచయితగా కూడా తన పేరును నిలబెట్టుకున్నారు. ఇప్పటివరకు ఏం రత్నం తీసిన సినిమాలలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు ఏ ఎం రత్నం.

 

Advertisement

ఏం రత్నం ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా ఖుషి. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. అప్పటినుంచి వీళ్ళిద్దరి మధ్య మొదలైన పరిచయం ఇప్పటికీ సజావుగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ కి ఏ ఎం రత్నం అంటే ప్రత్యేకమైన ఇష్టం అనేది రీసెంట్ గా హరిహర వీరమల్లు ప్రమోషన్లు చూసిన తర్వాత చాలామందికి అర్థం అయి ఉంటుంది.

ఆ పొలిటీషియన్ కు కౌంటర్

Advertisement

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే గత ప్రభుత్వంలో ఉన్న చాలా మంది మంత్రులు కామెంట్ చేసేవారు. రీసెంట్ టైమ్స్ లో కూడా చేస్తూ ఉన్నారు. అలానే హరిహర వీరమల్లు సినిమా గురించి అంబటి రాంబాబు కూడా కామెంట్ చేశారు. ఆ కామెంట్ కి అదిరిపోయే సమాధానం ఇచ్చారు నిర్మాత ఏం రత్నం. “అంబటి రాంబాబు సినిమా టికెట్ రేట్లు పెంచి ప్రజలని దోచుకుంటున్నం అని విమర్శలు చేస్తున్నారు ….అయినా వచ్చి నాతో సినిమా చేస్తే ఆ కష్టం తెలుస్తుంది …రోడ్ల మీద డాన్సులు వేస్తె కాదు.” అని ఏ ఎం రత్నం మాట్లాడారు. ప్రత్యేకించి ఎవరి పేరు తీయని ఏ ఎం రత్నం ఎందుకు ఇలా మాట్లాడారు అంటే.? అంబటి రాంబాబు మాట్లాడే తీరును బట్టి ఆయన రియాక్ట్ అయ్యారు అని చెప్పాలి.

మిక్స్డ్ టాక్ 

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఎప్పుడు చేయని విధంగా ప్రమోషన్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన అప్పటి నుంచి మిశ్రమ స్పందనతో నడుస్తుంది. ఈ సినిమా కొంతమందికి విపరీతంగా నచ్చింది. మరి కొంతమంది ఈ సినిమాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలలో ఎక్కువ అంచనాలు ఉన్న సినిమా ఓ జి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. స్వతహాగా సుజిత్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో, ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

Also Read: Vishwambhara : కీరవాణిని పక్కనపెట్టి భీమ్స్ తో సాంగ్ చేయించడానికి కారణం ఇదే

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×