E-Paper
Advertisement

Varanasi Movie: ఆ సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిమాము.. ప్రియాంక చోప్రా

Varanasi Movie: ఆ సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిమాము.. ప్రియాంక చోప్రా
Advertisement

Varanasi Movie: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వారణాసి సినిమాను ప్రపంచ స్థాయిలో తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. తాజాగా గ్లోబల్ మీడియాతో జరిగిన జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘వారణాసి’ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల కొన్ని నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చిందన్నారు. ఆ సినిమా వెనక ఉన్న కష్టాన్ని చెప్పుకొచ్చారు హీరోయిన్ ప్రియాంక చోప్రా. టెక్నికల్ పరంగా ఎంతో ఉన్నతంగా ఉండాలనుకునే రాజమౌళి ప్రతి ప్రేమ్ లోనూ చాలా శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “వారణాసి” చిత్రానికి సంబంధించి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళిని స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ వంటి దిగ్గజ దర్శకులతో పోల్చిన ప్రియాంక, ‘వారణాసి’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, భారతీయ సినిమా గర్వించదగ్గ ఒక గొప్ప అనుభూతి అని నొక్కి చెప్పారు. మహేష్ బాబును గతంలో ఎన్నడూ చూడని రీతిలో, శివుడి అనుగ్రహం ఉన్న పాత్రలో చూడబోతున్నామని ఆమె హింట్ ఇచ్చారు.

Read also-Varanasi: రాజమౌళిని ఆ ఒక్క కోరిక కోరిన ప్రియాంక చోప్రా.. మహేష్ బాబును బుక్ చేసేసిందిగా!

జంతువుల కదలికల మధ్య..

Advertisement

ఆఫ్రికాలోని కెన్యాలో ఉన్న మాసాయి మారా అడవుల్లో జరిగిన చిత్రీకరణ గురించి ప్రియాంక మాట్లాడుతూ.. “వారణాసి సినిమా షూటింగ్ అనుభవం నా జీవితంలో మర్చిపోలేనిది. ముఖ్యంగా ఆఫ్రికా షెడ్యూల్ చాలా సాహసోపేతంగా సాగింది. అక్కడ మేము జంతువుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి షూటింగ్ చేసేవాళ్లం. వన్యప్రాణుల వలస (Migration) సమయంలో చిత్రీకరణ జరగడం వల్ల, ఏనుగుల మందలు లేదా వైల్డ్ బీస్ట్‌లు కదిలినప్పుడు మాత్రమే మేము మా డైలాగులు చెప్పాల్సి వచ్చేది. అవి ఎప్పుడు కదులుతాయో తెలియదు కాబట్టి క్రూ మొత్తం నిద్రలేని రాత్రులు గడిపారు,” అని పేర్కొన్నారు.

Read also-Varanasi Update: రాజమౌళి ప్రియాంకకు ఇచ్చిన మాట ఇదే.. అలా కాకపోతే సినిమా రిలీజ్ కాదు..

రియాలిటీకే ప్రాధాన్యత..

Advertisement

సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల్లో జంతువుల సన్నివేశాలను సీజీఐ (CGI) లేదా వీఎఫ్ఎక్స్ (VFX) ద్వారా సృష్టిస్తారు. కానీ రాజమౌళి మాత్రం సాధ్యమైనంత వరకు సహజత్వాన్ని కోరుకున్నారు. “ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పరంగా చాలా రిచ్‌గా ఉంటుంది. కానీ, నిజమైన జంతువుల మధ్య, నిజమైన లొకేషన్లలో షూటింగ్ చేయాలని రాజమౌళి సార్ పట్టుబట్టారు. అడవిలో క్రూర మృగాల మధ్య నిలబడి నటించడం ఒకింత భయం వేసినా, ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది” అని ప్రియాంక వెల్లడించారు. చాలా కాలం తర్వాత ఇండియన్ స్క్రీన్ పైకి వస్తున్న ప్రియాంక, మొదట భాషా పరంగా కొంత ఆందోళన చెందారట. అయితే రాజమౌళి ఇచ్చిన హామీ తనను ఈ ప్రాజెక్ట్ వైపు నడిపించిందని ఆమె చెప్పారు. “ప్రియాంక.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ప్రతి ఫ్రేమ్‌లో నిన్ను అత్యుత్తమంగా చూపించే బాధ్యత నాది” అని ఆయన చెప్పిన మాటలు తనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయని ఆమె గుర్తు చేసుకున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×