// // Varanasi Movie - 'వారణాసి బడ్జెట్‌ ఎంతో చెప్పిన ప్రియాంక.. -->
E-Paper
Advertisement

Varanasi Movie: ‘వారణాసి బడ్జెట్‌ ఎంతో చెప్పిన ప్రియాంక.. వామ్మో ‘బాహుబలి’ కలెక్షన్స్‌ మించిందిగా..

Varanasi Movie: ‘వారణాసి బడ్జెట్‌ ఎంతో చెప్పిన ప్రియాంక.. వామ్మో ‘బాహుబలి’ కలెక్షన్స్‌ మించిందిగా..
Advertisement

Priyanka About Varanasi Budget: సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’ (Varanasi Movie). మహేష్‌ బాబు 29వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంపై విపరీతమైన బజ్‌ నెలకొంది. రీసెంట్‌గా రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌తో ఈ సినిమా క్రేజ్‌ గ్లోబల్‌ రేంజ్‌లో బజ్ క్రియేట్‌ చేసింది. అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌నే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని మించేలా ఏర్పాట్లు చేశాడు జక్కన్న. ఈ కార్యక్రమంలోనే మహేష్‌ బాబు ఫస్ట్‌ లుక్‌తో పాటు మూవీ టైటిల్‌ని ప్రకటించారు.

పాన్ వరల్డ్ స్థాయిలో బజ్

Advertisement

ఈ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌కి అంతర్జాతీయ స్థాయిలో రెస్పాన్స్‌ వచ్చింది. పాన్ వరల్డ్‌ స్థాయిలో యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని చూసేందుకు హాలీవుడ్‌ దిగ్గజం జేమ్స్‌ కామెరూన్‌ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతగా బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం బడ్జెట్‌పై ఆడియన్స్‌లో అమితాసక్తిని పెంచింది. ఎందుకంటే ఒక సినిమా పట్ల జక్కన్న విజన్‌ని ఎవరూ అంచన వేయలేరు. కనీసం ఆయన సినిమా టైటిల్‌, కాస్ట్‌ డిటైయిల్స్‌ తప్పిదే అసలు మూవీ జానర్‌ ఏంటి, అదే నేపథ్యం అనే అంశాన్ని కూడా బయటకు రానివ్వడు రాజమౌళి. ఇక ఆయన సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ విజువల్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌లో చూశాం.

బడ్జెట్ పై ప్రియాంక హింట్

ఇక వారణాసిని వీఎఫ్‌ఎక్స్‌, గ్రాఫిక్స్‌తో ఎంత అద్భుతంగా మలచపోతున్నాడో అనౌన్స్‌మెంట్‌ టీజర్‌తో శాంపిల్‌ వదిలాడు జక్కన్న. అందుకే రాజమౌళి అంటేనే బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి రూ. 600లకు పైగా కోట్ల బడ్జెట్‌ పెట్టిన జక్కన్న వారణాసి కోసం ఎంత పెట్టిస్తున్నాడానే చర్చ మొదలైంది. ఈ బడ్జెట్‌ వెయ్యి కోట్లపైనే ఉంటుందని నెటిజన్స్‌ నుంచి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వారణాసి బడ్జెట్‌పై హీరోయిన్‌ ప్రియాంక చోప్రా పెదవి విప్పింది. తాజాగా ఆమె ప్రముఖ కామెడీ టాక్‌ షో కపిల్‌ శర్మ షోకు హాజరైంది. ఇందులోప్రియాంక వారణాసి బడ్జెట్‌పై హింట్‌ ఇచ్చింది. ఈ షో హోస్ట్‌ కపిల్‌ శర్మ ప్రియాంకతో ఇలా అన్నారు. ‘వారణాసి’ సినిమా బడ్జెట్ రూ.1300 కోట్లు అని విన్నాం. ఈ సినిమాలోకి మీరు వచ్చినప్పటి నుంచీ బడ్జెట్ పెరిగిందని విన్నాం.

సగం ఆమెకేనా?

Advertisement

ఇది నిజమేనా?’ అని అడిగారు. ‘మీరు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు? బడ్జెట్‌లో సగం నా బ్యాంక్ ఖాతాలోకే పోయింది’ అంటున్నారా? అంటూ సరదాగా నవ్వింది. అయితే ఇక్కడ కపిల్‌ శర్మ వారణాసి బడ్జెట్‌ రూ. 1300 కోట్లా? అని అడగ్గానే.. అవును అన్నట్టుగానే చిన్న నవ్వు నవ్వి హింట్‌ ఇచ్చింది. దీంతో మూవీ బడ్జెట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం టాలీవుడ్‌లోనే కాదు ఇండియన్ మూవీ ఇండస్ట్రీలోనే ఇదే అత్యధిక బడ్జెట్‌ మూవీ అవుతుందని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్‌కు ఆ మాత్రం బడ్జెట్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి కెరీర్‌లో కూడా ఇదే అతి పెద్ద ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ‘వారణాసి’ భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న రెండో సినిమాగా నిలిచింది. నితీష్ తివారీ ‘రామాయణ్ పార్ట్ 1’ దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×