E-Paper
Advertisement

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు మాతృవియోగం!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు మాతృవియోగం!
Advertisement

Prakash Raj: చిత్ర సీమలో టాలీవుడ్ , బాలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి భాష చిత్రంతో సెలబ్రిటీలు అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓటీటీ ఆదరణ పెరిగిపోయిన తర్వాత అటు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అందుకే టాలీవుడ్ ను మొదలుకొని హాలీవుడ్ వరకు సినిమాలలో చేస్తున్న ప్రతి సెలబ్రిటీ కూడా ఇప్పుడు అభిమానులకు ఫేవరెట్ సెలబ్రిటీలు అయిపోయారు. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే క్షణాలలో వైరల్ అవుతుంది. ఇక ఆ సెలబ్రిటీలు పలు రకాల సమస్యల వల్ల తుది శ్వాస విడిచినా లేదా ఆ సెలబ్రిటీలకు సంబంధించిన కుటుంబీకులు మరణించిన సరే అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.. ఈ క్రమంలోనే చిత్ర సీమలో విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రకాష్ రాజ్ కు మాతృవియోగం..

ప్రకాష్ రాజ్ మాతృమూర్తి సువర్ణలత కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న సువర్ణ లత నేడు తన స్వగృహంలో ఉదయం తుది శ్వాస విడిచారు. ఇక సువర్ణ లత అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం బెంగళూరులో జరుగుతాయని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ,రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ మాతృ వియోగంతో కృంగిపోతున్న ప్రకాష్ రాజ్ కు అండగా నిలుస్తూ.. తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తల్లి మరణం ఆయనను శోకసంద్రంలో ముంచేసింది.

Advertisement

ALSO READ:నిన్న ధురంధర్.. నేడు మహాకాళి.. అక్షయ్ ఖన్నా ప్లాన్ అదుర్స్!

ప్రకాష్ రాజ్ సినిమా జీవితం..

విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ సినీ నటుడు మాత్రమే కాదు.. దర్శకుడు, నిర్మాత, టీవీ హోస్ట్ , రాజకీయ నాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. తెలుగు ,తమిళ్, కన్నడ, మలయాళం , హిందీ , ఆంగ్ల భాషా చిత్రాలలో తన విలక్షణమైన నటనతో ప్రసిద్ధి చెందిన ప్రకాష్ రాజ్ తన అద్భుతమైన నటన ప్రతిభతో 5 జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు 8 నంది పురస్కారాలు, 8 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, 6 ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు 4 సైమా అవార్డులు, 3 సినిమా పురస్కారాలు, 3 విజయ పురస్కారాలతో పాటు మరెన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తన మాతృభాష కన్నడ తో పాటు పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ మంచి ప్రావీణ్యం పొందిన ప్రకాష్ రాజ్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రజాధారణ పొందిన నటులలో ఒకరిగా నిలిచారు.

ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితం..

Advertisement

ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 1965 మార్చి 26న బెంగళూరులోని తులువ తండ్రికి , కన్నడిగ తల్లికి ప్రకాష్ రాయ్ గా జన్మించారు . సెయింట్ జోసెఫ్ ఇండియన్ హై స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చేరాడు.. ఇకపోతే ప్రముఖ సినీనటి గీత ప్రకాష్ రాయ్ ను ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు కే బాలచందర్ కు పరిచయం చేసింది .ఆయన సలహా మేరకు ప్రకాష్ రాజ్ తన ఇంటి పేరును రాయ్ నుండి రాజ్ గా మార్చుకొని.. ఇక అప్పటినుంచి ప్రకాష్ రాజ్ గా పిలవబడుతున్నారు. 1994లో లలితా కుమారిని వివాహం చేసుకున్న ఈయనకు.. ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు.. కొడుకు మరణించిన తర్వాత భార్య నుంచి దూరమైన ఈయన.. మరో వివాహం చేసుకోగా ఆమెకు ఒక కొడుకు జన్మించారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×